Dmart Shopping: దసరా వేళ షాపింగ్‌కు డీమార్ట్‌కు వెళుతున్నాారా..? ఈ తప్పులు చేయొద్దు.. ఇవి పాటిస్తే మీ బిల్లు తగ్గడం గ్యారంటీ..

దసరా, దీపావళి పండుగుల వేళ డీమార్ట్‌లో షాపింగ్ చేసేందుకు ఎక్కువమంది వెళ్తున్నారు. పిండి వంటల కోసం కావాల్సిన సరుకులు, ఇంట్లోకి అవసరమైన వస్తువులు తెచ్చుకునేందుకు ఇక్కడికి షాపింగ్‌కు పోతున్నారు. దీంతో డీమార్ట్‌లలో రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ సమయాల్లో కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించడం వల్ల మీ షాపింగ్ బిల్లు తగ్గించుకోవచ్చు.

Dmart Shopping: దసరా వేళ షాపింగ్‌కు డీమార్ట్‌కు వెళుతున్నాారా..? ఈ తప్పులు చేయొద్దు.. ఇవి పాటిస్తే మీ బిల్లు తగ్గడం గ్యారంటీ..
Dmart Shopping Tips

Updated on: Oct 17, 2026 | 11:56 AM

దసరా పండుగ వేళ ప్రజలు షాపింగ్‌లకు ఎక్కువ వెళ్తున్నారు. పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు అవసరమైన వస్తువులను తెచ్చుకుంటున్నారు. పండక్కి ఇంట్లో అవసరమైన సరుకులను ఒకేసారి తెచ్చుకునేందుకు తమ దగ్గర్లోని డీమార్ట్‌లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సూపర్ మార్కెట్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పండుగ సీజన్ కావడంతో భారీగా ఆఫర్లు కూడా లభిస్తుండటంతో.. జనాలు బారులు తీస్తున్నారు. దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో ఇంట్లో పిండి వంటలు, రకరకాల పదార్థాలు చేస్తూ ఉంటారు. దీంతో సరుకులు తెచ్చుకునేందుకు డీమార్ట్‌లకు వెళుతున్నారు. అయితే పండుగల వేళ షాపింగ్ బిల్లు పెరగకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలనేది చూద్దాం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ షాపింగ్ బడ్జెట్ తగ్గే అవకాశముంటుంది.

డీమార్ట్‌లో బిల్లు తగ్గించుకోవడం ఎలా..?

పండక్కి పిండివంటలు ఎక్కువగా చేసుకుంటుండటం వల్ల కిరాణా ఖర్చు పెరుగుతుంది. బయట షాపుల్లో ఎక్కువ ధరలు ఉంటాయి గనుక డీమార్ట్‌కు ఎక్కువమంది వెళుతుంటారు. బయట ధరలతో పోలిస్తే ఇక్కడ కిరాణా సరుకుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేగాక భారీ డిస్కౌంట్స్, వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించడం వల్ల మీరు బిల్లును మరింత తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు ఇంటి దగ్గరే ఏయే వస్తువులు కొనాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్లండి. దీని వల్ల అనవసర వస్తువుల కొనుగోలు చేయకపోవడం వల్ల మీ బిల్లు సగానికి సగం తగ్గుతుంది. డీమార్ట్ సొంత బ్రాండ్ ‘Premia’, ‘Swaad’ కలిగిన వస్తువులు మరింత తక్కువ ధరకు లభిస్తాయి. దీంతో వాటి కోసం వెతికి కొనుగోలు చేస్తే మీ డబ్బులు ఆదా అవుతాయి.

ఈ వస్తువులు సగానికి సగం తక్కువ ధరకే..

డీమార్ట్ సొంత బ్రాండ్ సరుకులు మిగతా కంపెనీల కంటే 15 నుంచి 25 శాతం తక్కువ ధరలో లభిస్తాయి. దీంతో ఎక్కువగా వాటిని కొనేందుకు ప్రిపర్ చేయండి. కొన్ని వస్తువులపై కిలో ప్యాకెట్ కంటే 500 ప్యాకెట్లపై ఆఫర్ ఉంటుంది. ఇలాంటివి చెక్ చేసి వాటినే తీసుకోవడం వల్ల షాపింగ్ ఖర్చు తగ్గుతుంది. వెంటనే పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వస్తువులు ఆఫర్లలో దొరికినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ పెట్టుకోండి. కొన్నిసార్లు మాల్‌లో కంటే డీమార్ట్ రెడీ యాప్‌లో తక్కువ ధరకు సరుకులు లభిస్తాయి. దీంతో యాప్ ద్వారా ఆర్డర్ పెట్టడం వల్ల ఇంటికే డెలివరీ వస్తాయి. దీని వల్ల ప్రయాణ ఖర్చులు, మీ సమయం ఆదా అవుతుంది. రద్దీ ఎక్కువగా లేనప్పుడు డీమార్ట్‌కు వెళ్లండి. దీని వల్ల ప్రశాంతంగా తక్కువ ధరకు లభించే వస్తువులను చూసి కొనుగోలు చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us