Aadhaar Card: మరణించిన వ్యక్తి ఆధార్ నిమిషాల్లోనే డీయాక్టివేట్ చేయొచ్చు.. ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఇలా..

మరణించిన వ్యక్తి ఆధార్ దుర్వినియోగం కాకుండా, మోసాల బారిన పడకుండా ఉండాలంటే వారి ఆధార్ డీయాక్టివేట్ చేయాలి. ఇందుకోసం కుటుంబసభ్యులు యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. దీంతో పరిశీలన అనంతరం ఆధార్ డీయాక్టివేట్ అవుతుంది. ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు.

Aadhaar Card: మరణించిన వ్యక్తి ఆధార్ నిమిషాల్లోనే డీయాక్టివేట్ చేయొచ్చు.. ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఇలా..
Aadhaar Card

Updated on: Oct 09, 2026 | 10:04 AM

ఓ వ్యక్తి మరణిస్తే.. వారి ఆధార్ కార్డు ఏమవుతుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ ఆధార్ కార్డును కుటుంబసభ్యులు ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందవచ్చని అనుకుంటారు. కానీ యూఐడీఏఐ నిబంధనలకు అది విరుద్దం. మీరు ఒక వ్యక్తి గుర్తింపు పత్రాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. మీపై పోలీస్ కేసు నమోదు చేయడంతో పాటు కోర్టుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. ఆధార్ అనేది ప్రతీఒక్కరికీ వ్యక్తిగత గుర్తింపు పత్రం. ఇందులో మనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ దాగి ఉంటాయి. దీంతో ఒకరి కార్డును మరొకరు ఉపయోగించడానికి నిబంధనలు అంగీకరించవు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే.. వారి ఆధార్ కార్డును ఆన్‌లైన్ ద్వారా సులువుగా డీయాక్టివేట్ చేయవచ్చు. దీని వల్ల వారి కార్డును ఇంకెవరు ఉపయోగించలేరు. ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం.

ఏయే డాక్యుమెంట్స్ అవసరం..?

మరణించిన వ్యక్తి ఆధార్ కార్డును ఆన్‌లైన్ ద్వారా డీయాక్టివేట్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డెట్ సర్టిఫికేట్, మరణించిన వ్యక్తి ఆధార్ నెంబర్, ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో వారి ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవసరం. యూఐడీఏఐ వెబ్ సైట్లోకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి మరణించిన వ్యక్తి ఆధార్ పనిచేయకుండా డీయాక్టివేట్ చేస్తారు. ఆధార్ డేటాబస్ నుంచి వారి పేరు తొలగిస్తారు. ఆధార్ రికార్డులను అప్డేటెడ్‌గా ఉంచడానికి, ఖచ్చితత్వంతో ఉంచడం, దుర్వినియోగం జరగకుండా చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మరణించిన వ్యక్తి ఆధార్ యాక్టివ్‌లో ఉండటం వల్ల దాని ద్వారా మోసాలు జరిగే ఆస్కారముంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కుటుంబసభ్యులు డీయాక్టివేట్ కోసం ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాలి. ప్రభుత్వ రికార్డులు ఖచ్చితంగా ఉంచడం, కుటుంబాలకు చట్టపరమైన, అధికారిక పనులను సులభతరం చేయడం కోసం ఇది సహాయపడుతుంది.

ఆన్‌లైన్ ద్వారా ఆధార్ డీయాక్టివేట్ ప్రాసెస్ ఎలా..?

-యూఐడీఏఐ పోర్టల్ https://myaadhaarbeta.uidai.gov.in/లోకి వెళ్లండి

-అప్డేట్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోండి

-అందులో అప్డేట్ డిసీజెడ్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోండి

-మీ ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి

-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి

-అనంతరం రిపోర్ట్ డెట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మరణించిన వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, మరణించిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి

-ఇక డెత్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి

-వివరాలు నిర్ధారించుకున్న తర్వాత సబ్‌మిట్ చేయాలి

-అనంతరం అధికారులు పరిశీలించి ఆధార్ డీయాక్టివేట్ చేస్తారు

 

Loading...
Unable to load recommendations.
Follow Us