CNG Price: వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కేజీపై ఎంతంటే?

దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఇటీవలే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కిలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)పై 1 రుపాయలు పెంచింది. ఈ పెంచిన రేట్లు సైతం తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేవలం 48 గంటల వ్యవధిలో ధరలు పెరగడం ఇది రెండోసారి.

CNG Price: వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కేజీపై ఎంతంటే?
Cng Price Hike India

Updated on: May 17, 2026 | 10:23 AM

పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా ఏర్పడ చమురు కొతర కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిపోయవడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇందన ధరలు కూడా పెరగుతున్నాయి. ఈ క్రమంలో మన దేశంలోనూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచేసింది. మే 15న సీఎన్‌జీ ధరలతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు సుమారు రూ.3, డీజిల్ ధరను లీటరుకు దాదాపు రూ.3 మేర పెంచింది.

48 గంటల్లోనే మరోసారి

అయితే ఈ ధరలు పెంపు అమల్లోకి వచ్చిన 48 గంటలకే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోషాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా మళ్లీ సీఎన్‌జీ ధరను పెంచిది. తాజాగా ఇవాళ కేజీ CNG పై రూ.1 కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీంతో గడిచిన రెండ్రోజుల్లో CNG పై మొత్తం 3 రూపాయలు పెరిగింది. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం కిలో CNG ధర రూ.80.09గా ఉండగా హైదరాబాద్‌లో కిలో CNG ధర రూ.97గా ఉంది.

ధరల పెరుగుదలకు ఇదేనా కారణం

పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతబడింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో అన్ని దేశాల్లో కూడా ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి.

ధరల పెంపుపై ప్రభుత్వ వివరణ

ఇక దేశంలో ఇందన ధరల పెంపుపై అటు ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 20 శాతం నుండి 100 శాతం వరకు పెరిగాయని.. భారతదేశంలో మాత్రం పెట్రోల్‌పై కేవలం 3.2 శాతం, డీజిల్‌పై 3.4 శాతం మాత్రమే ధరలను పెంచామని తెలిపారు. మిగతా భారాన్ని మొత్తం ప్రభుత్వం, ఆయల్ కంపెనీలే మోస్తున్నాయన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us