
ఈ రోజుల్లో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం సాధారణం. జీతం ఖాతాలు, జీరో-బ్యాలెన్స్ అకౌంట్లు, పాత జాయింట్ ఖాతాలు వంటి వాటిని కొంతకాలం తర్వాత వాడటం మానేస్తారు. అయితే వాటిని అధికారికంగా మూసివేయకపోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. ఖాతాలో డబ్బు లేకపోతే ఎలాంటి ప్రమాదం ఉండదని అనుకోవడం తప్పు. కనీస నిల్వ లేకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. దీంతో ఖాతా బ్యాలెన్స్ నెగెటివ్‌లోకి వెళ్లే అవకాశముంది. చాలా కాలం లావాదేవీలు లేకపోతే ఆ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయాలంటే బ్యాంక్ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సాధారణ సేవింగ్స్ ఖాతా నేరుగా క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదు. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యం ఉన్న ఖాతాల్లో బకాయిలు ఉంటే, అవి రుణంగా పరిగణించబడతాయి. దీని ప్రభావం సిబిల్ స్కోర్‌పై పడే అవకాశం ఉంది. పాత ఖాతాలు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, EMIలు, లేదా ఇతర సేవలతో లింక్ అయి ఉండొచ్చు. ఖాతాలో డబ్బు లేకపోతే చెల్లింపులు బౌన్స్ అవుతాయి. దీనివల్ల అదనపు ఛార్జీలు విధించబడటమే కాకుండా, క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. తక్కువగా ఉపయోగించే ఖాతాలు సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అప్‌డేట్ చేయకపోతే అనుమానాస్పద లావాదేవీలపై అలర్ట్స్ రావు.
పాత బ్యాంక్ ఖాతాలను సమయానికి మూసివేయడం ద్వారా అనవసర జరిమానాలు, సైబర్ మోసాలు, క్రెడిట్ సమస్యలను నివారించవచ్చు. ఇది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగంగా నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి