D Mart: డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు.. పైగా నిమిషాల్లోనే..

సరుకులు తక్కువ ధరకు రావాలంటే గతంలో అందరి నోట వినిపించే మాట డీ మార్ట్. కానీ ఇప్పుడు సీన్ మారింది. జియో మార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఫ్లిక్ కార్ట్ వంటి యాప్స్ రంగంలోకి దిగడంతో క్విక్ కామర్స్ విప్లవం నడుస్తోంది. కేవలం 10 నుండి 20 నిమిషాల లోపే డీ మార్ట్ రేంజ్ డిస్కౌంట్లతో వస్తువులన్నీ మీ ఇంటి ముందుకే వస్తున్నాయి.

D Mart: డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు.. పైగా నిమిషాల్లోనే..
Dmart Alternative Online Grocery Apps

Updated on: May 31, 2026 | 11:58 AM

భారతీయ రిటైల్ మార్కెట్‌లో తక్కువ ధరలు, హోల్‌సేల్ డిస్కౌంట్లతో డీ మార్ట్ ఒక వెలుగు వెలుగుతోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కిరాణా సామాగ్రి కొనాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఇదే. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో కేవలం డీ-మార్ట్ మాత్రమే కాదు.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రంగాలలో అనేక ఇతర ప్లాట్‌ఫార్మ్స్ కూడా భారీ ఆఫర్లతో గట్టి పోటీ ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో డీ-మార్ట్ కంటే తక్కువ ధరలకే వస్తువులను అందిస్తూ, నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేస్తున్నాయి. మార్కెట్‌లోకి కొత్త కొత్త యాప్స్ రావడం, పోటీ పెరగడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. కేవలం ఆఫ్‌లైన్ స్టోర్లకు వెళ్లి క్యూలో నిలబడే పని లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారా డీ మార్ట్ కంటే తక్కువ ధరలకే కిరాణా సామాగ్రిని ఎలా పొందాలో ఇక్కడ చూద్దాం.

జియో మార్ట్ – డీ మార్ట్‌కు మైండ్ బ్లోయింగ్ పోటీ

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో మార్ట్ ప్రస్తుతం డీ-మార్ట్‌కు అతిపెద్ద కాంపిటీటర్‌గా మారింది. జియో మార్ట్‌లో కొన్ని రకాల నిత్యావసర ఉత్పత్తులపై ఏకంగా ఎమ్మార్పీ కంటే 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కిస్సాన్ కెచప్, ఆయిల్స్, నిత్యావసర సరుకులు ఇక్కడ చాలా తక్కువ ధరకే లభిస్తాయి. బల్క్ ఆఫర్‌లతో పాటు ఉచిత లేదా అతి తక్కువ డెలివరీ ఛార్జీలతో వస్తువులను నేరుగా ఇంటికే పంపుతుంది. యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా సులువుగా ఆర్డర్ చేయవచ్చు.

బిగ్ బాస్కెట్

టాటా గ్రూప్‌కు చెందిన బిగ్ బాస్కెట్ నాణ్యతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. సాధారణంగా అన్ని వస్తువులపై 11 నుండి 12 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయి. అయితే వీటి ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై మరింత ఎక్కువ ఆఫర్స్ లభిస్తాయి. మెట్రో నగరాలలో ఆర్గానిక్, ప్రీమియం, తాజా కూరగాయలు, పండ్లు కొనుగోలు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు వీరు BB Now ద్వారా కేవలం 15-20 నిమిషాల్లోనే క్విక్ డెలివరీని కూడా అందిస్తున్నారు.

బ్లింకిట్ 10 నిమిషాల మెరుపు డెలివరీ

జొమాటో ఆధ్వర్యంలో నడుస్తున్న బ్లింకిట్ ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. రోజువారీ కిరాణా, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై ఇక్కడ లభించే ధరలు డీ మార్ట్ స్థాయిలో లేదా కొన్నిసార్లు అంతకంటే తక్కువగా కూడా ఉంటున్నాయి. దీని ప్రత్యేకతే వేగం.. కేవలం 10 నుండి 30 నిమిషాల లోపే ఆర్డర్ చేసిన వస్తువులన్నీ ఇంటి ముందర ఉంటాయి. అత్యవసరంగా సరుకులు కావాలనుకునే వారికి ఇది ప్రాణప్రదంగా మారింది.

అమెజాన్ ఫ్రెష్ – ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ

ఈ ఈ కామర్స్ దిగ్గజాలు కేవలం ఎలక్ట్రానిక్స్, బట్టలకే పరిమితం కాకుండా కిరాణా రంగంలోనూ దుమ్మురేపుతున్నాయి. నెలాఖరు లేదా నెల ప్రారంభంలో జరిగే సూపర్ సేవింగ్స్ డేస్ లలో కిరాణా ఉత్పత్తులపై 11-12 శాతం లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాయి. పండుగ సీజన్లలో ఇక్కడ ఆఫర్లు భారీగా ఉంటాయి. క్రెడిట్, డెబిట్ కార్డ్ బ్యాంక్ ఆఫర్స్ ఉపయోగించి అదనంగా మరో 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

విశాల్ మెగా మార్ట్ – తక్కువ ధరల ఆఫ్‌లైన్ కేరాఫ్

మీరు ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లోనే షాపింగ్ చేయాలనుకుంటే డీ-మార్ట్‌కు సరైన ప్రత్యామ్నాయం విశాల్ మెగా మార్ట్. కిరాణా సామాగ్రితో పాటు బట్టలు, గృహోపకరణాలు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభిస్తాయి. కొన్ని హోమ్ మేడ్ అండ్ లోకల్ బ్రాండ్ ఉత్పత్తుల ధరలు డీ-మార్ట్ కంటే కూడా తక్కువగా ఉండటం విశేషం. బల్క్ డిస్కౌంట్లకు ఇది కేరాఫ్ అడ్రస్.

స్మార్ట్ షాపింగ్ టిప్ – ఆదాయాన్ని ఎలా ఆదా చేసుకోవాలి?

ప్రస్తుతం ఏ ఒక్క స్టోర్‌కో పరిమితం కాకుండా.. నెలవారీ సరుకులు కొనే ముందు ఒకసారి ఈ యాప్స్ ఓపెన్ చేసి ధరలను డీ మార్ట్‌తో పోల్చి చూసుకోవడం మంచిది. ముఖ్యంగా బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌పై ఆన్‌లైన్ యాప్స్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో కలిపి డీ మార్ట్ కంటే తక్కువ ధరకే ఇస్తున్నాయి. ఆఫర్లను సరైన సమయంలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి నెలా వేల రూపాయల బడ్జెట్‌ను ఆదా చేసుకోవచ్చు.

Follow Us