Air Conditioner: ఇంట్లోకి ఏసీ కొంటున్నారా..? ఈ విషయం తెలుసుకోకుండా కొంటే మీకే నష్టం..

సమ్మర్ క్రమంలో ఏసీల సేల్స్ పెరిగిపోతున్నాయి. కొత్తగా ఏసీలు కొనేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారు. కానీ ఏసీలో కొనేముందు ఎలాంటి మోడల్ కొంటే మంచిదనేది ఆలోచించుకోవాలి. మీ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు, విద్యుత్ సరఫరాకు అనుగుణంగా కొత్త ఏసీని ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Air Conditioner: ఇంట్లోకి ఏసీ కొంటున్నారా..? ఈ విషయం తెలుసుకోకుండా కొంటే మీకే నష్టం..
Air Conditioner 1

Updated on: Jun 01, 2026 | 2:50 PM

వేసవికాలం కావడంతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండలను తట్టుకునేందుకు చల్లదనం కోసం ప్రజలు ఇళ్లల్లో ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక ఏసీలో లేనివారు కొత్తగా ఏసీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఏసీ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఏసీ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గమనించాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీలలో చాలా రకాలు ఉంటాయి. ఏసీ కొనేటప్పుడు స్టెబిలైజర్ తీసుకోవాలా.. ? వద్దా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇన్వర్టర్ ఏసీలకు స్టెబిలైజర్ అవసరం లేదు. గతంలో స్టెబిలైజర్‌ ఏసీలకు తప్పనిసరిగా భావించేవారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏసీ వల్ల దాని అవసరం తగ్గింది. అయినప్పటికీ చాలామంది ఏసీ భద్రత కోసం ప్రత్యేకంగా స్టెబిలైజర్‌ను అమర్చుకుంటారు. ఇలాంటప్పుడు మీ ప్రాంతంలోని విద్యుత్ సరఫరా, ఏసీ మోడల్, మీ బడ్జెట్‌పై దీని అవసరం ఆధారపడి ఉంటుంది.

ఇన్వర్టర్ AC

ఇన్వర్టర్ ఏసీలు ఇన్‌బిల్ట్‌గా వోల్టేజ్ రక్షణను కూడి ఉంటాయి. ఇవి 160 వాట్స్ నుండి 290 వాట్స్ వరకు వోల్టేజ్‌ల వద్ద సౌకర్యవంతంగా పనిచేస్తాయి. ఈ కారణంతో సాధారణ విద్యుత్ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఈ రకం ఏసీలకు ప్రత్యేక స్టెబిలైజర్ అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. గోడకు ప్రత్యేకంగా స్టెబిలైజర్ అమర్చే అవసరం కూడా ఉండదు. దీని వల్ల ఇల్లు శుభ్రంగా, పద్ధతిగా కనిపిస్తుంది.

స్టెబిలైజర్‌ అవసరం ఎప్పుడు..?

మీ ప్రాంతంలో తరచుగా విద్యుత్ అంతరాయాలు లేదా తీవ్రమైన వోల్టేజ్ హెచ్చుతగ్గులు సంభవిస్తుంటే స్టెబిలైజర్ అమర్చుకోవడం మంచిది. ఆకస్మిక పవర్ సర్జ్‌ల నుండి ఏసీని ఇది రక్షిస్తుంది. పాత ఏసీ మోడళ్లు లేదా బడ్జెట్ ఏసీలలో ఇన్‌బిల్ట్ రక్షణ కొన్ని ఏసీలలో ఉండదు. ఇటువంటి సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు స్టెబిలైజర్ విద్యుత్ సరఫరాను నిలిపివేసి వోల్టేజ్ సాధారణ స్థితికి వచ్చినప్పుడు దాన్ని పునఃప్రారంభిస్తుంది. కంప్రెసర్, సర్క్యూట్ బోర్డ్ వంటి ఖరీదైన భాగాలను ఇది రక్షిస్తుంది.

స్టెబిలైజర్ ఏం చేస్తుంది..?

స్టెబిలైజర్ అనేది విద్యుత్ ఉప్పెనను గ్రహించి ఏసీని రక్షిస్తుంది. అయితే ఇన్‌బిల్ట్ వోల్టేజ్ రక్షణ కలిగిన ఏసీల ధర మార్కెట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. 1.5-టన్ ఏసీ రూ.37 వేల నుండి రూ.47 వేల మధ్య ఉంటుంది. ఈ ఫీచర్ లేని మోడళ్లు తక్కువ ధరకే వస్తాయి కానీ వాటికి ప్రత్యేక స్టెబిలైజర్ అవసరం పడవచ్చు. స్టెబిలైజర్ ఖర్చు కూడా మొత్తం ఖర్చుకు అదనంగా చేరుతుంది. దీంతో పాటు స్టెబిలైజర్‌ను ఉపయోగించడం వల్ల విద్యుత్ బిల్లు కొద్దిగా పెరగవచ్చు.

Follow Us