
సాధారణంగా బ్యాంకు లావాదేవీలు అనేవి రోజువారీ కార్యకలాపాల్లో భాగం కానప్పటికీ.. వాటి పని దినాలపై మాత్రం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా.. మరే ఇతర ట్రాన్సాక్షన్ కోసం అయినా బ్యాంకు పనిదినాలను ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ముఖ్యంగా జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి బ్యాంకుల సెలవుల సమాచారం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2026 నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది.
కాగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను రిజర్వు బ్యాంక్ ప్రకటిస్తుంటుంది. అందులో ఒకటి నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్.. రెండవది నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే.. మూడవది బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్. ఇక ఈ నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు ఉంటుంది. వాటితో పాటు పండుగలు, ప్రాంతీయ వేడుకల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అలానే రాబోయే డిసెంబర్ లో కూడా క్రిస్మస్ సహా పలు ప్రాంతీయ పండుగలు కలిపి పలు తేదీల్లో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు కావున ఏ తేదీన ఏ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవు అనే వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
డిసెంబర్ 2026లో ఆదివారాలు 6, 13, 20, 27 తేదీల్లో వచ్చాయి. రెండో శనివారం డిసెంబర్ 12న, నాలుగో శనివారం డిసెంబర్ 26న ఉన్నాయి. ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.
తేదీ – సెలవు వివరాలు – సెలవు వర్తించే ప్రాంతాలు
అందుబాటులోనే డిజిటల్ సేవలు..
మరోవైపు బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ సాధారణంగా చాలా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెకింగ్ వంటి సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లతో నగదు బదిలీలు, బిల్లుల చెల్లింపులు, ఆన్లైన్ కొనుగోళ్లు చేసుకోవచ్చు. NEFT, RTGS వంటి ఆన్లైన్ నగదు బదిలీ సేవలు కూడా సాధారణంగా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అయితే సాంకేతిక సమస్యలు, నిర్వహణ పనుల కారణంగా అప్పుడప్పుడు సేవలకు అంతరాయం కలగవచ్చు. అందుకే చెక్ డిపాజిట్లు, నగదు లావాదేవీలు, బ్యాంకు శాఖలోనే చేయాల్సిన పనులు ఉంటే సెలవులకు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.