Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..

బ్యాంక్ సెలవులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రతీ నెలలో సెలవులు ఒకేలా ఉండవు. పండుగల సెలవులు, సాధారణ సెలవుల కారణంగా బ్యాంక్ సెలవులు ప్రతీ నెలా మారుతుంటాయి. వచ్చే వారంలో దీపావళి పండుగ వస్తుండటంతో బ్యాంకులు ఎక్కువ రోజుల పాటు మూతపడనున్నాయి. వచ్చే నెలలో బ్యాంక్ సెలవులు చూద్దాం.

Bank Holidays: నవంబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ రోజుల్లో బంద్.. ముందే ప్లాన్ చేసుకోండి..
Bank Holidays

Updated on: Oct 26, 2026 | 7:01 AM

నవంబర్‌ నెల రావడానికి మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రానున్న నెలలో దీపావళి లాంటి పెద్ద పండుగ వస్తోంది. దీంతో బ్యాంకులు కూడా ఎక్కువ రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో బ్యాంకులను సందర్శించాలనుకునేవారు ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ హాలీడేస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ నెలలో అనేక పండగలు, ప్రాంతీయ పండుగలు, సాధారణ సెలవులు వస్తున్నాయి. దేశంలో బ్యాంకింగ్ సేవలపై ఇవి ప్రభావితం చేయనున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంక్ హాలీడేస్ ఒకేలా ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవుల్లో మార్పులు ఉంటాయి. బ్యాంకులను సందర్శించాలనుకునేవారు ముందుగానే సెలవుల గురించి తెలుసుకుని బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి. నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

నవంబర్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..

-నవంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు

-నవంబర్ 8న దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవు

-నవంబర్ 9న గోవర్ధన్ పూజ, విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా చండీగఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు

-నవంబర్ 10న మంగళవారం బలి ప్రతిపద, విక్రమ్ సంవత్ నూతన సంవత్సరం,గుజరాతీ నూతన సంవత్సరం పురస్కరించుకుని మహారాష్ట్ర, గుజరాత్‌లో బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 14వ తేదీన రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు

-నవంబర్ 15 ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

-నవంబర్ 22వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 23న సోమవారం మేఘాలయలో బ్యాంకులు ఉండవు

నవంబర్ 24వ తేదీన గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా అస్సాంలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి

-నవంబర్ 28న నాల్గో శనివారం సందర్భంగా బ్యాంకులు ఉండవు

-నవంబర్ 29న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు

సెలవు రోజుల్లో ఏయే సేవలు పనిచేస్తాయంటే..?

బ్యాంకు సెలవు దినాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. దీంతో వీటి ద్వారా తమ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. NEFT, RTGS, IMPS, యూపీఐ సేవలు నిరంతరం పనిచేస్తాయి. దీంతో ఎప్పుడైనా నిధులు బదిలీ చేసుకోవచ్చు. వీటి ద్వారవా వినియోగదారులు బ్రాంచ్‌కు వెళ్లకుండానే అకౌంట్ సమాచారాన్ని పొందవచ్చు. అయితే భౌతిక పత్రాలు, బ్రాంచ్ ధృవీకరణ, నగదు నిర్వహణ లేదా ఇతర వ్యక్తిగత సహాయం అవసరమయ్యే సేవల కోసం బ్రాంచ్ తిరిగి తెరిచే వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us