Telugu News Business Bank holidays in May 2025: Banks to remain closed on THESE days across India
May Bank Holidays: మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
Bank Holidays: బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం.. మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు..
మే 2025లో మధ్యప్రదేశ్‌లో అనేక బ్యాంకు సెలవులు ఉంటాయి. ఈ నెలలో ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత పనులు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. ముందుగా బ్యాంకుల సెలవుల జాబితాను చెక్ చేసుకోండి. మే 1న మేడే, 2న శంకరాచార్య జయంతి నుండి మే 25, 2025న వారపు సెలవు వరకు బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం.. మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో చూద్దాం..
మే 2025 బ్యాంక్ సెలవుల జాబితా:
మే 1 గురువారం: కార్మిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు.
మే 4 ఆదివారం : దేశ వ్యాప్తంగా ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
మే 9 శుక్రవారం : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా హాలీడే.
మే 10 శనివారం: రెండోశనివారం సందర్భంగా సెలవు.
మే 11 ఆదివారం: సాధారణం దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మే 12 సోమవారం: బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలో సెలవు, తెలంగాణలో ఆప్షనల్ హాలీడే.
మే 16 శుక్రవారం: సిక్కింలో సెలవు.
మే 18 ఆదివారం : సాధారణంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మే 24 శనివారం: నాలుగో శనివారం సందర్భంగా సెలవు.
మే 25 ఆదివారం: సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
మే 26 సోమవారం: ఖాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు సందర్భంగా సిక్కింలో హాలీడే.
మే 29 గురువారం: మహారాణా ప్రతాప్ జయంతి పలు రాష్ట్రాల్లో సెలవులు.
మే 30 శుక్రవారం : గురు అర్జున్ దేవ్ జీ బలిదానం దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే.