Telugu News Business Bank holidays in june 2025: Banks to remain closed for 13 days check city wise holiday list
June Bank Holidays: జూన్ నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవులే..!
వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళుతున్నట్లయితే, వచ్చే నెలలో అంటే జూన్‌లో మీ నగరంలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.
చాలా మందికి ప్రతి రోజు బ్యాంకు పని నిమిత్తం వెళ్తుంటారు. అయితే బ్యాంకుకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయోనన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మే నెల ముగిసి జూన్ నెల వచ్చేస్తోంది. వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళుతున్నట్లయితే, వచ్చే నెలలో అంటే జూన్‌లో మీ నగరంలో ఎన్ని రోజులు బ్యాంకులు మూసివేయబడతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.
బ్యాంకులకు 13 రోజులు సెలవులు:
1 జూన్ – ఆదివారం కావడంతో ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
6 జూన్ – ఈద్ ఉల్ అధా (బక్రీద్) సందర్భంగా తిరువనంతపురం, కొచ్చిలో బ్యాంకులకు సెలవు.