Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చెల్లించారా..? ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు..

బ్యాంక్ ఖాతాను మూసివేయడం అనేది అనేక కారణాల వల్ల అవసరం కావచ్చు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల లభ్యత తగ్గడం, మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించలేకపోవడం, డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు, ఎస్ఎంఎస్ ఛార్జీలు వంటి అధిక ఖాతా ఛార్జీలు దీనికి కారణం కావచ్చు.

Bank Account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చెల్లించారా..? ఈ ఒక్క పాయింట్ తెలిస్తే చాలు..
Bank Account 2

Updated on: Oct 04, 2026 | 8:39 PM

వివిధ కారణాలతో చాలామంది బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేస్తూ ఉంటారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోవడం లేదా అవసరం లేకపోవడం వంటి కారణాలతో ఖాతా మూసివేస్తారు.  బ్యాంకులు ఇప్పుడు జీరో బ్యాలెన్స్ ఖాతాలను చాలావరకు నిలిపివేశాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల బ్యాంకులకు ఎటువంటి లాభం ఉండదు. మినిమం బ్యాలెన్స్ ఖాతాల ద్వారా బ్యాంకులు మన బ్యాలెన్స్‌ను ఉపయోగించుకొని పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతాయి. ఈ మినిమమ్ బ్యాలెన్స్‌ను నిర్వహించలేక చాలామంది తమ ఖాతాలను మూసివేయాలని అనుకుంటారు. ఇక డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు, ఎస్ఎంఎస్ ఛార్జీలు వంటి అధిక నిర్వహణ ఛార్జీల వల్ల కూడా ఖాతాలు నిలిపివేయాలనకుంటారు. ఈ ఛార్జీలు అధికంగా ఉన్నప్పుడు ఖాతాను మూసివేయడం ఉత్తమ ఎంపికగా అనిపిస్తుంది. అయితే అకౌంట్ మూసివేత ప్రక్రియలో సాధారణంగా నాలుగు ప్రధాన సందేహాలు తలెత్తుతాయి. మన సేవింగ్స్ ఖాతాను ఆన్‌లైన్‌లో మూసివేయవచ్చా? నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే దానిని చెల్లించిన తర్వాతే ఖాతాను మూసివేయాలా? బ్యాంక్ ఖాతాను ఎలా మూసివేయాలి? ఏ పత్రాలు సమర్పించాలి?  ఖాతాను మూసివేస్తే ఎంత ఛార్జీలు పడతాయి? లాంటాి ప్రశ్నలకు ఇందులో సమాధానాలు చూద్దాం.

మీరు మీ బ్యాంక్ ఖాతాను ఆన్‌లైన్‌లో మూసివేయలేరు. బ్యాంక్ ఖాతాను మూసివేయడానికి మీరు తప్పనిసరిగా మీ హోమ్ బ్రాంచ్‌ను సందర్శించాలిజ మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్ళిన తర్వాత, అక్కడ “అకౌంట్ క్లోజర్ ఫారం” ఉంటుంది. దానిని తీసుకొని మీరు ఏ బ్యాంక్ ఖాతాను మూసివేయాలనుకుంటున్నారో ఆ ఖాతా వివరాలను నింపాలి. మీ ఖాతాలో ఏమైనా బ్యాలెన్స్ మిగిలి ఉంటే..ఆ బ్యాలెన్స్‌ను మరొక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయమని కోరాలి. ఈ వివరాలన్నీ నింపిన తర్వాత.. మీ డెబిట్ కార్డ్, చెక్‌బుక్‌లను బ్యాంక్ అధికారులకు సమర్పించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ ఖాతా సాధారణంగా ఏడు పని దినాలలో మూసివేయబడుతుంది.  ఖాతా మూసివేతకు కొన్ని ఛార్జీలు వర్తిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి ఉండవు. మీరు మీ సేవింగ్స్ ఖాతాను తెరిచిన 14 రోజులలోపు మూసివేయాలని నిర్ణయించుకుంటే లేదా ఒక సంవత్సరం తర్వాత మూసివేయాలని అనుకుంటే ఎటువంటి ఛార్జీలు పడవు. కానీ మీరు ఖాతాను తెరిచిన 14 రోజుల తర్వాత నుంచి ఒక సంవత్సరం లోపు మూసివేయాలని నిర్ణయించుకుంటే రూ.500 ప్లస్ జీఎస్టీ ఛార్జీలు వర్తిస్తాయి.

బ్యాంక్ ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే దానిని చెల్లించాల్సి ఉంటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు ఖాతాదారులపై నెగిటివ్ బ్యాలెన్స్‌ను విధించకూడదు. మీరు మినిమమ్ బ్యాలెన్స్‌ను నిర్వహించకపోతే బ్యాంకులు మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను మాత్రమే కట్ చేసుకొని ఖాతాను జీరో బ్యాలెన్స్‌కు తీసుకురావచ్చు. కానీ నెగిటివ్ బ్యాలెన్స్‌కు తీసుకుపోకూడదు. ఒకవేళ ఖాతాను మూసివేయడానికి దానిని చెల్లించాలని డిమాండ్ చేస్తే.. మీరు బ్యాంక్ సిబ్బందితో మాట్లాడండి. ఆర్‌బీఐ మార్గదర్శకాలను వారికి గుర్తుచేసి.. నెగిటివ్ బ్యాలెన్స్ లేకుండానే ఖాతాను మూసివేయమని అడగండి. వారు ఒప్పుకోకపోతే.. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us