Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ఈకేవైసీ మీ మొబైల్‌లోనే చేసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా సింపుల్.. ఎలా అంటే..?

ఆయుష్మాన్ భారత్ కార్డ్ కేవైసీ ఆన్‌లైన్‌లో చేసుకోవడం చాలా సులువు. మీ మొబైల్ ద్వారానే మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మీ కార్డు నెంబర్ మర్చిపోయినా మొబైల్ నెంబర్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ ఈకేవైసీ మీ మొబైల్‌లోనే చేసుకోవచ్చు.. ప్రాసెస్ చాలా సింపుల్.. ఎలా అంటే..?
Ayushman Bharat 3 Copy

Updated on: Oct 19, 2026 | 11:30 PM

ఆయుష్మాన్ భారత్  కార్డు ఉన్నవారికి శుభవార్త. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కింద రూ.5 లక్షల ఉచిత ట్రీట్‌మెంట్ పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియను అత్యంత సులువుగా పూర్తి చేసుకోవచ్చు. గతంలో ఈకేవైసీ కోసం ఆసుపత్రులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) చూట్టూ తిరగాల్సి వచ్చేసింది. అయితే ఇప్పుడు మీరూ ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌లోనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీని  లబ్ధిదారులకు సమయం, డబ్బులు రెండూ ఆదా అవుతాయి. ఆయుష్మాన్ భారత్ యాప్‌ ద్వారా మీ ఆధార్ నంబర్‌కు లింక్ చేసి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి ఈకేవైసీ సులభంగా పూర్తి చేయవచ్చు. ఇంటి నుంచే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియ  పూర్తి చేయవచ్చు. దీని వల్ల మీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఎప్పుడూ యాక్టివ్‌లో ఉంటుంది. ఆరోగ్య సేవలను పొందాలనుకునేవారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది.

అయితే మొబైల్ యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలంటే.. మీ ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా యాక్టివ్‌లో ఉండాలి. ఓటీపీ ధృవీకరణ ద్వారా సురక్షితంగా, సులభంగా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ సదుపాయం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తుంది. అలాగే డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. మీ ఆధార్ కార్డులో ఏవైనా వివరాలు అప్డేట్ చేసుకున్నప్పుడు.. ఆయుష్మాన్ కార్డులోనూ అప్‌డేట్ కావాలంటే ఈ రీ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి అవుతుంది.  ఇక ఆయుష్మాన్ భారత్ పోర్టల్ ద్వారా కూడా మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

వెబ్ సైట్ ద్వారా పూర్తి చేయడం ఎలా..?

ఆయుష్మాన్ భారత్ వెబ్ సైట్ https://beneficiary.nha.gov.in/ ఓపెన్ చేయండి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో “Login” ఆప్షన్  క్లిక్ చేయాలి.  “Login using ABHA Number” లేదా “Login using Mobile Number” అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు నెంబర్ తెలియకపోతే”Login using Mobile Number” ఆప్షన్‌ను ఎంచుకోండి. అనంతరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి కార్డ్‌ను క్రియేట్ చేసుకునేటప్పుడు రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత “Continue” బటన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి “Continue”పై క్లిక్ చేయండి. ఆ అనంతరం మీ పేరు, అభా నంబర్,  అభా అడ్రస్ కనిపిస్తాయి. అనంతరం రీ-కేవైసీ వెరిఫికేషన్ ఆప్షన్ ఎంపిక చేసుకోేండి. అనంతరం మీ ఆధార్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us