Tata curve EV : టాటా నుంచి మరో సూపర్ ఈవీ కారు..ప్రత్యేకతలు, ధర వివరాలు ఏంటంటే?

ఎలక్ట్రిక్ కార్లపై ప్రజలకు ఆసక్తి పెరగడంతో వాటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కూడా తన ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యను పెంచుకుంటూ మార్కెట్ లో తన స్థానాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి అనేక ఈవీలు విడుదలయ్యాయి. పంచ్, నెక్సాన్, టియాగో, టిగోర్ తదితర కార్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కర్వ్ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. దీని ధరను రూ.17.43 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లకు ఏర్పాటు చేసింది.

Tata curve EV : టాటా నుంచి మరో సూపర్ ఈవీ కారు..ప్రత్యేకతలు, ధర వివరాలు ఏంటంటే?
Tata Curve Ev
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:50 PM

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అనేక కొత్త బ్రాండ్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. వీటి డిమాండ్ కు అనుగుణంగా వివిధ కంపెనీలు తమ కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లపై ప్రజలకు ఆసక్తి పెరగడంతో వాటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కూడా తన ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యను పెంచుకుంటూ మార్కెట్ లో తన స్థానాన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి అనేక ఈవీలు విడుదలయ్యాయి. పంచ్, నెక్సాన్, టియాగో, టిగోర్ తదితర కార్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కర్వ్ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. దీని ధరను రూ.17.43 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లకు ఏర్పాటు చేసింది. 55 కేడబ్ల్యూహెచ్ లాంగ్ రేంజ్, 45 కేడబ్ల్యూహెచ్ మిడ్ రేంజ్ ప్యాక్ లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు బుకింగ్ లు ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఆకట్టుకునే డిజైన్

టాటా కర్వ్ కారు డిజైన్ ను ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు. కారు బయట డిజైన్ విజయానికి వస్తే ఫ్లష్ – ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్, స్ప్లిట్ హెడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ముందు, వెనుక భాగాలలో ఎల్ ఈడీ లైట్ బార్స్, కారు ఫేసియా ముందు భాగంలో చార్జింగ్ పోర్ట్, డ్యూయల్ – టోన్ వీల్స్, స్లోపింగ్ రూఫ్ లైన్, ఎల్ఈడీ టైల్స్ ల్యాంప్స్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కారు డైమన్షన్స్ గురించి తెలుసుకోవాలంటే.. ఈ కారు 190 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, ఆర్18 అల్లాయ్ వీల్స్ తో విడుదలైంది. కారు లోపల డిజైన్ అత్యద్భుతంగా రూపొందించారు. డ్యాష్ బోర్డుపై ఫాక్స్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్, ఇట్యూమినేటెడ్ టాటా లోగోతో ఫోర్ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, ఏసీ బటన్లను ఆపరేట్ చేయడానికి టచ్ కంట్రోల్స్, పనోరమిక్ రూఫ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. నెక్సాన్ కారులోని సెంటర్ కన్సోల్ కూడా ఈ కారులో కనిపిస్తోంది. వీటికి అదనంగా డ్రైవ్ మోడ్ సెలెక్టర్, పార్సిల్ ట్రే, డ్యూయల్ టోన్ థీమ్, కొత్త తాళాలు, పవర్డ్ టెయిల్ గేట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్ లెస్ చార్జర్, ఇంజిన్ స్టార్ట్, స్టాప్ బటన్స్ అమర్చారు.

ప్రత్యేకతలు

టాటా కర్వ్ ఈవీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో విడుదలైంది. దీనిలోని 55 కేడబ్ల్యూహెచ్ యూనిట్ కు సింగిల్ మోాటారు జత చేశారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు 585 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. అలాగే 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వెర్షన్ ను చార్జింగ్ చేస్తే 502 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మొత్తానికి కర్వ్ కారు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు.

ఇవి కూడా చదవండి

భద్రతా ఫీచర్లు

కొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారులో అనేక భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేశారు. సేఫ్టీ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్) ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఏర్పాటు చేసిన మొదటి కారు ఇదే కావడం విశేషం. అదనంగా 20 రకాల సేఫ్టీ ఫీచర్లతో లెవల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ అమర్చారు. భారత్ ఎన్ క్యాప్ టెస్టులో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ రావడం మరో ప్రత్యేక విషయం. సూటిగా చెప్పాలంటే ఈ కారు అత్యంత భద్రంగా, సురక్షితంగా ప్రయాణం సాగించవచ్చు.

ఐదు రకాల వేరియంట్లు

  • క్రియేటివ్ వేరియంట్ లో 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ కారు రూ.17.49 లక్షలకు అందుబాటులో ఉంది.
  • అకాంప్లిష్డ్ వేరియంట్ లో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. 45 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.18.49 లక్షలకు, 55 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.19.25 లక్షలకు లభిస్తుంది.
  • అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ లో 45 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.19.29 లక్షలకు, 55 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.19.99 లక్షలకు విక్రయిస్తున్నారు.
  • ఎంపవర్డ్ ప్లస్ కారు రూ.21.25 లక్షలకు అందుబాటులో ఉంది. దీనిలో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేశారు.
  • ఎంపవర్డ్ ప్లస్ ఏ వేరియంట్ లో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీని ధర రూ.21.99 లక్షలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టాటా నుంచి మరో సూపర్ ఈవీ కారు..ప్రత్యేకతలు, ధర వివరాలు ఏంటంటే?
టాటా నుంచి మరో సూపర్ ఈవీ కారు..ప్రత్యేకతలు, ధర వివరాలు ఏంటంటే?
బంగ్లాదేశ్‌ బాధితులకు అండగా నిలుద్దాంః ఆర్‌ఎస్‌ఎస్
బంగ్లాదేశ్‌ బాధితులకు అండగా నిలుద్దాంః ఆర్‌ఎస్‌ఎస్
ఈ కానిస్టేబుల్‌కి సెల్యూట్.. యాక్షన్‌ సీన్‌ను మించిన సాహాసం
ఈ కానిస్టేబుల్‌కి సెల్యూట్.. యాక్షన్‌ సీన్‌ను మించిన సాహాసం
షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య..
షూటింగ్‏లో గాయపడిన హీరో సూర్య..
వయనాడ్‌కు ప్రధాని మోడీ.. ఆ ప్రాంతాల పరిశీలన.. అధికారులతో సమావేశం
వయనాడ్‌కు ప్రధాని మోడీ.. ఆ ప్రాంతాల పరిశీలన.. అధికారులతో సమావేశం
స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి.
స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి.
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి