Smoking: స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి..

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ అనగానే సహజంగా శ్వాసకోశ సంబంధిత సమస్లు వస్తాయని అనుకుంటాం. అయితే స్మోకింగ్ వల్ల కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు...

Smoking: స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి..
smoking
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:35 PM

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు స్మోకింగ్ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ అనగానే సహజంగా శ్వాసకోశ సంబంధిత సమస్లు వస్తాయని అనుకుంటాం. అయితే స్మోకింగ్ వల్ల కేవలం ఊపిరితిత్తులపైనే కాకుండా ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ స్మోకింగ్‌ వల్ల శరీరంలో ఏయే భాగాలపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. భారతదేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన 20 కోట్ల మంది ప్రజలు ధూమపానానికి బానిసలుగా మారారని చెబుతున్నాయి. ధూమపానం అలవాటు దీర్ఘకాలంగా ఉన్న వారిలో తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. 99 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు స్మోకింగ్ కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ హృదయనాళ వ్యవస్థను పాడు చేస్తాయని చెబుతున్నారు. శరీరంలోకి ప్రవేశించిన నికోటిన్ రక్తనాళాల సంకోచానికి కారణమవుతుంది.

ఈ కారణంగానే శరీరలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. ధూమపానం చేసేవారికి రక్తం గడ్డకట్టడం, రక్తపోటు వంటి సమస్యలు రావడానికి ఇదే ప్రధాన కారణం. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్మోకింగ్‌ మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నికోటిన్‌ కేంద్ర నాడీ వ్యవస్థలో అంతరాయాన్ని కలిగిస్తుంది.

నికోటిన మెదడు నరాలను చెడుగా ప్రభావితం చేస్తాయి. దీంతో ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక స్మోకింగ్‌ వల్ల జీర్ణ వ్యవస్థ సైతం దెబ్బతింటుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి అనేక సమస్యలకు కూడా స్మోకింగ్ కారణంగా చెబుతున్నారు. అలాగే స్మోకింగ్ వల్ల దంతాలు కూడా పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది చిగుళ్లలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. చిగుర్ల నుంచి రక్తం వస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి.
స్మోకింగ్‌తో లంగ్స్‌ మాత్రమే కాదు.. ఈ అవయవాలు కూడా దెబ్బ తింటాయి.
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన మను భాకర్..
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి
నువ్వే కావాలి సినిమా చేయకపోవడానికి కారణం అదే.. అక్కినేని హీరో..
నువ్వే కావాలి సినిమా చేయకపోవడానికి కారణం అదే.. అక్కినేని హీరో..
ఈఆహారాలు తిన్నారంటే.. కొల్లాజెన్ పెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు..
ఈఆహారాలు తిన్నారంటే.. కొల్లాజెన్ పెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు..
పన్ను బాదుడు నుంచి వారికి ఉపశమనం.. సీబీడీటీ కీలక ప్రకటన ఏంటంటే..?
పన్ను బాదుడు నుంచి వారికి ఉపశమనం.. సీబీడీటీ కీలక ప్రకటన ఏంటంటే..?
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
కలకలం రేపుతున్న 'చండీపురా' వైరస్‌.. రెండేళ్ల బాలిక మృతి
కలకలం రేపుతున్న 'చండీపురా' వైరస్‌.. రెండేళ్ల బాలిక మృతి