PAYD Insurance: ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరం ఆధారంగా బీమా ప్రీమియం

భారతదేశంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజల అవసరాలు కూడా మారుతున్నాయి. గతంలో కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైన కారు..క్రమేపి మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే కారు ఎంత మోజుపడి కొనుగోలు చేసినా దాని నిర్వహణ అనేది సగటు మధ్య తరగతి ప్రజలకు భారంగానే ఉంటుంది. ముఖ్యంగా కారు ఇన్సూరెన్స్ అనేది మనం ప్రయాణించినా ప్రయాణించకపోయినా నిర్ణత మొత్తంలో కట్టాల్సి ఉంటుంది. కానీ కారును వాడనప్పుడు వేలల్లో ఇన్సూరెన్స్ ప్రీమింయలు చెల్లించాలంటే సగటు వినియోగదారుడికిగా బాధగా ఉంటుంది.

PAYD Insurance: ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరం ఆధారంగా బీమా ప్రీమియం
Payd Insurance
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:30 PM

భారతదేశంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజల అవసరాలు కూడా మారుతున్నాయి. గతంలో కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైన కారు..క్రమేపి మధ్యతరగతి ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే కారు ఎంత మోజుపడి కొనుగోలు చేసినా దాని నిర్వహణ అనేది సగటు మధ్య తరగతి ప్రజలకు భారంగానే ఉంటుంది. ముఖ్యంగా కారు ఇన్సూరెన్స్ అనేది మనం ప్రయాణించినా ప్రయాణించకపోయినా నిర్ణత మొత్తంలో కట్టాల్సి ఉంటుంది. కానీ కారును వాడనప్పుడు వేలల్లో ఇన్సూరెన్స్ ప్రీమింయలు చెల్లించాలంటే సగటు వినియోగదారుడికిగా బాధగా ఉంటుంది. అయితే ఇలాంటి వారికి ఊరటనిచ్చేలా కారు ప్రయాణించిన దూరం ఆధారంగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించే సదుపాయం ఉందని చాలా మందికి తెలియదు. పీఏవైడీ పేరుతో అందుబాటులో ఉన్న ఈ ఇన్సూరెన్స్ నిర్ణీత వార్షిక రుసుము కాకుండా మీరు డ్రైవ్ చేసే వాస్తవ దూరం ఆధారంగా ప్రీమియం లెక్కించే కారు బీమా అని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒకవేళ మీరు తక్కువ దూరం ప్రయాణిస్తే బీమా ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. పీఏవైడీ అనేది ముఖ్యంగా డ్రైవర్ల కోసం రూపొందించిన బీమా అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీఏవైడీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

పీఏవైడీ వర్కింగ్ ఇలా

మీరు పాలసీ వ్యవధిలో డ్రైవ్ చేయాలని భావిస్తున్న మొత్తం కిలోమీటర్లను అంచనా వేసి, తగిన స్లాబ్‌ను ఎంచుకోవచ్చు. అలాగే  టెలిమాటిక్స్ టెక్నాలజీ ఆధారంగా వేగం, దూరం, రోజు సమయం, డ్రైవింగ్ నమూనాలతో సహా డ్రైవింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై డేటాను సేకరించి బీమా ప్రీమియం నిర్ణయిస్తారు. ఈ డేటా బీమాదారులు ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడుతుంది. మీరు ఎంచుకున్న కిలోమీటర్ స్లాబ్ ఆధారంగా బీమా కంపెనీ మీ ప్రీమియంను లెక్కిస్తుంది. అలాగే మీ వాహనానికి సంబంధించిన మైలేజ్ టెలిమాటిక్స్ పరికరం లేదా మీ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ట్రాక్ చేస్తారు. పాలసీ వ్యవధి ముగింపులో మీ వాస్తవ మైలేజ్ డిక్లేర్డ్ చేసిన దానితో పోల్చి చూసి మీరు తక్కువ డ్రైవ్ చేస్తే మీ సొమ్మును తిరిగి వాపసు ఇస్తారు. మీరు ఎక్కువ డ్రైవ్ చేసినట్లయితే, మీరు అదనపు ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు

పీఏవైడీ ప్రయోజనాలు ఇవే

ముఖ్యంగా కారు రెంట్‌కు ఇచ్చే వారు ట్రావెల్స్ వారు ఈ బీమా చేయించుకోవడం వల్ల బీమా ప్రీమియం గణనీయంగా తగ్గుతుంది. మీరు ఉపయోగించే కవరేజీకి మాత్రమే మీరు చెల్లిస్తారు. కొన్ని బీమా సంస్థలు టెలిమాటిక్స్ ద్వారా ట్రాక్ చేసిన సురక్షితమైన డ్రైవింగ్ ప్రవర్తనకు తగ్గింపులను అందిస్తాయి. వాహనం నడిచే దూరం ఆధారంగా బీమా ప్రీమియం లెక్కిస్తారు. వినియోగదారులు ప్రీమియంలు వారి వినియోగానికి నేరుగా సంబంధం ఉన్నందున వారి వాహనాలను తరచుగా ఉపయోగించే లేదా తక్కువ దూరం నడిపే డ్రైవర్లకు పీఏవైడీ మరింత పొదుపుగా ఉంటుంది. కొన్ని పీఏవైడీ పాలసీలు సౌకర్యవంతమైన కవరేజ్ ఎంపికలను అందిస్తాయి. పాలసీదారులు వారి డ్రైవింగ్ అలవాట్లు, అవసరాల ఆధారంగా వివిధ స్థాయిల కవరేజీని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

పీఏవైడీ వల్ల నష్టాలు

పీఏవైడీ ఇన్సూరెన్స్‌లో భాగంగా వాహనంలో ఏర్పాటు చేసే టెలిమాటిక్స్ పరికరాల వల్ల గోప్యతా సమస్యలు తలెత్తుతాయి. అయితే అనుకోకుండా అంచనాకు మించి దూరం ప్రయాణిస్తే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్ విషయంలో ప్రయాణించే దూరం, ఇతర టెలిమాటిక్స్ డేటాను ధ్రువీకరించడానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. పీఏవైడీ అనే విధానం భారతదేశంలో కొత్తగా ఉంటుంది. బీమాదారులు, కస్టమర్‌లు దాని ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుని బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
ఆ ప్రత్యేక కారు బీమా గురించి మీకు తెలుసా? ప్రయాణించిన దూరమే ఆధారం
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
మెగా వేలానికి ముందు బీసీసీఐ కీలక మార్పు.. ధోనికి లైన్ క్లియర్..
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి
దువ్వాడ శ్రీనివాస్‌తో తన రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిన మాధూరి
నువ్వే కావాలి సినిమా చేయకపోవడానికి కారణం అదే.. అక్కినేని హీరో..
నువ్వే కావాలి సినిమా చేయకపోవడానికి కారణం అదే.. అక్కినేని హీరో..
ఈఆహారాలు తిన్నారంటే.. కొల్లాజెన్ పెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు..
ఈఆహారాలు తిన్నారంటే.. కొల్లాజెన్ పెరిగి ఎంతో అందంగా కనిపిస్తారు..
పన్ను బాదుడు నుంచి వారికి ఉపశమనం.. సీబీడీటీ కీలక ప్రకటన ఏంటంటే..?
పన్ను బాదుడు నుంచి వారికి ఉపశమనం.. సీబీడీటీ కీలక ప్రకటన ఏంటంటే..?
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
కలకలం రేపుతున్న 'చండీపురా' వైరస్‌.. రెండేళ్ల బాలిక మృతి
కలకలం రేపుతున్న 'చండీపురా' వైరస్‌.. రెండేళ్ల బాలిక మృతి
వారెవ్వా.. ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేస్తోంది
వారెవ్వా.. ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేస్తోంది
సెట్ అప్ బాక్స్ రిలీజ్ చేసిన గూగుల్… ప్రత్యేకతలు తెలిస్తే షాక్
సెట్ అప్ బాక్స్ రిలీజ్ చేసిన గూగుల్… ప్రత్యేకతలు తెలిస్తే షాక్
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
వెంటాడి, వేటాడి రగులుతున్న బంగ్లాదేశ్.. హీరోను కూడా చంపేశారు.!
300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..
300 సినిమాల్లో కనిపించిన వృక్షం నేలకూలింది! తిరిగి పునరుజ్జీవం..
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచంటే..?
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి.. మానవత్వం మరిచి పాలు పట్టుకుని..
భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.!
భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.!
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలా.? అయితే ఇది మీకోసమే.!
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలా.? అయితే ఇది మీకోసమే.!
రోడ్డు లేక ప్రాణం పోయింది.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!
రోడ్డు లేక ప్రాణం పోయింది.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!