
అమెజాన్ మ్యూజిక్ సర్వీసులో మూడు కొత్త స్థాయిలను (Tiers) కంపెనీ తీసుకువచ్చింది. మీరు ప్రీమియం ఆడియో క్వాలిటీ, యాడ్-ఫ్రీ అనుభవం కోరుకుంటే అన్‌లిమిటెడ్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉచితంగా లభించిన ఫీచర్లకు ఇకపై డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. ప్రైమ్ మెంబర్స్, సాధారణ యూజర్లకు అందుబాటులో ఉండబోయే ఈ మూడు రకాల ప్లాన్స్, వాటి ధరలు, ఇతర మార్పుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం!
2018 నుండి భారతదేశంలో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉచితంగా లభిస్తున్న అమెజాన్ మ్యూజిక్ విధానం జూలై 2, 2026 నుండి మారుతోంది. ఇకపై అమెజాన్ మ్యూజిక్ మూడు వేర్వేరు విభాగాలలో అందుబాటులోకి రానుంది.
పాత విధానంలో ప్రైమ్ మెంబర్స్ అందరికీ ఒకే రకమైన మ్యూజిక్ అనుభవం ఉండేది. ఇప్పుడు కంపెనీ ఆడియోఫైల్స్ (Audiofiles) కోసం ప్రత్యేకంగా ‘అన్‌లిమిటెడ్’ ప్లాన్‌ను తెచ్చి, వారికి స్టూడియో-క్వాలిటీ ఆడియోను అందిస్తోంది. అయితే, సాధారణంగా పాటలు వినేవారికి, డౌన్‌లోడ్ సదుపాయం లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. మీరు పాటలను డౌన్‌లోడ్ చేసుకుని వినడం లేదా హై-క్వాలిటీ ఆడియోను ఇష్టపడే వారైతే, మీరు ‘అన్‌లిమిటెడ్’ ప్లాన్‌కు మారడం తప్పనిసరి.