AC Tips: మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్.. వెంటనే ఇలా చేయండి..

వేసవిలో ఇంట్లో ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేం. అయితే ఏసీని వాడుతున్నప్పుడు మనం చేసే ఒక చిన్న పొరపాటు వల్ల అది త్వరగా పాడైపోతుందని మీకు తెలుసా? అంతేకాదు దీనివల్ల నెల తిరిగేసరికి కరెంట్ బిల్లు కూడా షాక్ ఇస్తుంది. ఇంతకీ ఏసీని ఆపేటప్పుడు రిమోట్‌తో ఆఫ్ చేయాలా? లేక నేరుగా మెయిన్ స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లి ఆపేయాలా? ఈ రెండింటిలో ఏది సేఫ్.. ఏది డేంజర్? తెలుసుకుందాం..

AC Tips: మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్.. వెంటనే ఇలా చేయండి..
How Turning Off Your Ac The Right Way

Updated on: Jun 02, 2026 | 8:56 AM

ఎండలు మండిపోతుండటంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ వాడకం బాగా పెరిగిపోయింది. చాలామంది కొత్త ఏసీలు కొంటుంటే.. మరికొందరు ఉన్న ఏసీలనే రిపేర్ చేయించుకుని వాడుతున్నారు. అయితే ఏసీని వాడేటప్పుడు మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల అది త్వరగా పాడైపోయే అవకాశం ఉందని మీకు తెలుసా? దీనివల్ల ఏసీ ఆయుష్షు తగ్గడమే కాకుండా నెల తిరిగేసరికి కరెంట్ బిల్లు కూడా భారీగా వస్తుంది. సాధారణంగా చాలామంది ఏసీ రూమ్ నుండి బయటకు వెళ్లేటప్పుడు కేవలం రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తుంటారు. మరికొందరేమో నేరుగా బోర్డు దగ్గరికి వెళ్లి మెయిన్ స్విచ్ ఆపేస్తుంటారు. అసలు ఏసీని ఆఫ్ చేయడానికి సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు సులువుగా తెలుసుకుందాం…

రిమోట్‌తో ఏసీ ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభాలు.

చాలామంది రిమోట్‌తో ఆఫ్ చేస్తే కరెంట్ వేస్ట్ అవుతుందని అనుకుంటారు. కానీ రోజువారీ వాడకంలో మొదట రిమోట్‌తోనే ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే రిమోట్‌తో ఆఫ్ చేసినప్పుడు ఏసీ లోపల ఉండే కంప్రెసర్, ఇతర భాగాలు ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా ఆగుతాయి. దీనివల్ల వాటిపై ఒక్కసారిగా ఒత్తిడి పడదు. కొత్త ఏసీలను రిమోట్‌తో ఆపినప్పుడు వాటి రెక్కలు ఆటోమేటిక్‌గా మూసుకుంటాయి. అదే డైరెక్ట్‌గా స్విచ్ ఆపేస్తే ఆ రెక్కలు తెరుచుకునే ఉండిపోతాయి. దీనివల్ల లోపలికి దుమ్ము, ధూళి సులభంగా చేరిపోతాయి. రిమోట్‌తో ఆఫ్ చేస్తే.. మీరు ముందుగా సెట్ చేసుకున్న కూలింగ్ , ఫ్యాన్ స్పీడ్ అలాగే ఉంటాయి. మళ్లీ ఆన్ చేసినప్పుడు కొత్తగా సెట్ చేయాల్సిన పని ఉండదు.

రిమోట్‌తో ఆఫ్ చేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందా?

రిమోట్‌తో ఏసీని ఆఫ్ చేసినప్పుడు అది పూర్తిగా బంద్ అవ్వదు. కేవలం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్తుంది. ఈ సమయంలో ఏసీ చాలా అంటే చాలా తక్కువ కరెంట్‌ను మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల మీ నెలవారీ కరెంట్ బిల్లులో ఎలాంటి పెద్ద మార్పు ఉండదు.

మరి మెయిన్ స్విచ్‌ను ఎప్పుడు ఆఫ్ చేయాలి?

ప్రతిసారీ డైరెక్ట్‌గా మెయిన్ స్విచ్ ఆపడం మంచిది కానప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం స్విచ్ ఆఫ్ చేయడం చాలా ముఖ్యం..

ఊళ్లకు వెళ్లినప్పుడు: మీరు ఇల్లు తాళం పెట్టి కొన్ని రోజుల పాటు బయట ఊరికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.

కరెంట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు: మీ ఏరియాలో వోల్టేజ్ సమస్యలు ఎక్కువగా ఉంటే, ఏసీని మెయిన్ స్విచ్ ద్వారా పూర్తిగా బంద్ చేయడం సేఫ్.

డైరెక్ట్‌గా స్విచ్ ఆపేస్తే వచ్చే నష్టాలు..

ఏసీ నడుస్తుండగా ఒక్కసారిగా మెయిన్ స్విచ్ ఆపేయడం అస్సలు మంచి అలవాటు కాదు. దీనివల్ల లోపల ఉండే ఎలక్ట్రానిక్ పార్ట్స్ దెబ్బతింటాయి. లాంగ్ రన్‌లో ఇది ఏసీ లైఫ్‌ను తగ్గించి, ఎక్కువ కరెంట్ లాగేలా చేస్తుంది.

నిపుణుల సలహా ఏంటంటే..?

రోజూ ఏసీని ఆఫ్ చేసేటప్పుడు మొదట రిమోట్ ద్వారానే ఆఫ్ చేయండి. రాత్రి పూట ఏసీ వాడకం పూర్తయ్యాక గానీ, లేదా ఆ రోజుకి ఇక ఏసీ అవసరం లేదు అనుకున్నప్పుడు గానీ.. రిమోట్‌తో ఆఫ్ చేసిన కాసేపటి తర్వాత మెయిన్ స్విచ్‌ను కూడా ఆపేయడం అన్నిటికంటే ఉత్తమమైన, సురక్షితమైన పద్ధతి.

Follow Us