AC Tips: ఏసీ కొనడం మంచిదా? అద్దెకు తీసుకోవడం మంచిదా..? డబ్బులు ఆదా చేసుకునేందుకు బెస్ట్ ట్రిక్..

ఇంట్లోకి ఏసీ కొనుగోలు చేయడం మంచిదా లేదా అద్దెకు తీసుకోవడం మంచిదా? అనేది చాలామంది ఆలోచిస్తుంటారు. వేసవి కావడంతో చాలామంది అద్దెకు ఏసీలు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది కొత్త ఏసీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రెండిటిల్లో ఏది మంచిది..? ఏది తీసుకుంటే డబ్బులు ఆదా అవుతాయి? అనే విషయాలు చూద్దాం.

AC Tips: ఏసీ కొనడం మంచిదా? అద్దెకు తీసుకోవడం మంచిదా..? డబ్బులు ఆదా చేసుకునేందుకు బెస్ట్ ట్రిక్..
Air Conditioner

Updated on: Jun 03, 2026 | 4:47 PM

ఏసీ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంట్లో ఏసీ అవసరం ఉంటుది. వేసవికాలం కొనసాగే మూడు నెలల పాటు ఎండ, ఉక్కబోత కష్టాలు తప్పించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎయిర్ కండీషనర్ అవసరం పెద్దగా ఉండదు. దీంతో మూడు నెలల కోసం ఏసీ అవసరమా? అని చాలామంది ఆలోచిస్తుంటారు. మూడు నెలలకు ఏసీ అద్దెకు తెచ్చుకుంటే డబ్బులు ఆదా అవుతాయని అనుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏసీ కొనడం మంచిదా? అద్దెకు తెచ్చుకోవడం మంచిదా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వీరికి బెస్ట్ ఆప్షన్

ఏసీ అద్దెకు తీసుకోవడం మంచిదా లేదా కొనుగోలు చేయడం మంచిదా? అనేది మీరు ఒక ప్రాంతంలో నివసించే కాలాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఏదైనా ఒక ప్రాంతంలో కొన్ని నెలలు, ఒకటి లేదా రెండేళ్ల పాటు నివాసం ఉండాలనుకుంటే అద్దెకు తీసుకోవడం మంచి ఆప్షన్. దీని వల్ల డబ్బులు ఆదా అవుతాయి. ఇక ఎక్కువ సంవత్సరాలు నివాసం ఉండాలనుకుంటే మాత్రం కొనుగోలు చేయడం మంచిది. తరచూ నివాసలు మారేవారికి ఏసీ ఇన్‌స్టాలేషన్, రవాణా ఖర్చులు చాలా అవుతాయి. ఇలాంటివారు అద్దెకు తీసుకోవడం వల్ల అవన్నీ ఆదా అవుతాయి. విద్యార్థులు, ఉద్యోగులు వంటివారు అద్దెకు తీసుకోవడమే మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఎప్పుడు కొనాలి..?

మీరు ఎక్కువ ఏళ్లు ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండాలనుకుంటే ఏసీ కొనుగోలు చేయడం మంచి ఎంపిక. పాత ఏసీలు విద్యుత్‌ను ఎక్కువగా వాడతాయి. అదే కొత్త ఏసీలు కరెంట్‌ను తక్కువగా వినియోగిస్తాయి. దీని వల్ల మీ కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. స్ధిరంగా ఒకేచోట ఉన్నప్పుడు ఏసీ ఇన్‌స్టాలేషన్ ఖర్చులు కూడా ఉండవు.

ఏసీని అద్దెకు తీసుకుంటున్నారా..?

అయితే ఏసీని అద్దెకు తీసుకునే సమయంలో కొన్ని విషయాలను గమనించాలి. ఇన్వర్టర్, అధిక స్టార్ రేటింగ్ కలిగిన ఏసీని తీసుకోండి. దీని వల్ల మీ కరెంట్ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అదనపు, ఇన్‌స్టాలేషన్ వంటి ఛార్జీల గురించి కూడా తెలుసుకోండి.  తరచుగా ఇల్లు మారేవారికి  అద్దెకు తీసుకోవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అమర్చడం, తీసివేయడం వంటి శ్రమ తగ్గుతుంది. ఒకే చోట స్థిరంగా నివసించేవారికి కొత్త ఏసీ ఉత్తమం. దీనివల్ల తరచుగా మార్చాల్సిన అవసరం తగ్గి ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతో ఈ విషయాలను గమనించి మీరు నిర్ణయం తీసుకోండి.

Follow Us