Telugu News Business Aadhaar Card Updates: Aadhaar photo needs to be updated every 10 years, here is how to do it
Aadhaar Card Updates: యూఐడీఏఐ కీలక అప్‌డేట్.. మీరు ఆధార్ కార్డు తీసుకుని 10 ఏళ్లు అయ్యిందా? అయితే ఈ పని వెంటనే చేయాల్సిందే..
మన దేశంలో డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. అయితే చాలా మంది ఆధార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లలో తిరుగుతుంటారు. ఆధార్‌లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఆధార్ కార్డు..
మన దేశంలో డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. అయితే చాలా మంది ఆధార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉన్నాయి. వాటిని సరి చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లలో తిరుగుతుంటారు. ఆధార్‌లో తప్పులు ఉండటం కారణంగా సమస్యలు వస్తుంటాయి. ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, లింగం మొదలైన వాటిని మార్పులు చేసుకునే వెలసులుబాటు కల్పించింది యూఐడీఏఐ. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కార్డులో ప్రతి సమాచారాన్ని పదేపదే మార్పు చేసుకునేందుకు కుదరదు.
ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. యూఐడీఏఐ నుంచి అందిన సమాచారం ప్రకారం.. అన్ని రాష్ట్రాలు దాని అధికారిక పరిధిని పెంచాలని కోరింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరూ తమ ఆధార్, బయోమెట్రిక్‌లను, ఫోటోను అప్‌డేట్ చేసేలా ప్రోత్సహించాలని యూఐడీఏఐ తెలిపింది. తద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచుకుంటారు.
నమోదు చేసుకునే సమయంలో 5 లేదా 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఫోటోగ్రాఫ్‌ల వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
ప్రాథమిక నమోదు సమయంలో పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, వారు 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తిరిగి నమోదు చేసి ఉండాలి. మొత్తం బయోమెట్రిక్ డేటాను అందించాలి.
ఎన్‌రోల్‌మెంట్ సమయంలో పిల్లల వయస్సు 5 – 15 సంవత్సరాల మధ్య ఉంటే, వారు 15 సంవత్సరాలు నిండినప్పుడు అప్‌డేట్ కోసం అన్ని బయోమెట్రిక్‌లను అందించాలి.
నమోదు సమయంలో 15 ఏళ్లు పైబడిన నివాసితులు, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయాలని కేంద్రం సిఫార్సు చేసింది.
ఇలా చేయడం ద్వారా ఫేక్ బేసిస్ కూడా అరికట్టబడుతుందని, అలాగే ప్రతి ఒక్కరి డేటా కూడా పూర్తిగా భద్రంగా ఉంటుంద యూఐడీఏఐ డేటా సెక్యురిటీ తెలిపింది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా ఎంపిక చేసుకున్న ప్రతి పదేళ్లకు బయోమెట్రిక్స్, డెమోగ్రాఫిక్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.