Budget app Features : కోవిడ్ నేపథ్యంలో పేపర్ లెస్ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీంతో సామాన్యులు కూడా బడ్జెట్ వివరాలు తెలుసుకునేలా మొబైల్ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. మరి ఈ యాప్ ఫీచర్లు ఏమిటి? దీని ద్వారా ఎలాంటి సమాచారం మనం పొందొచ్చు? ఎవరైన ఎలా ఉపయోగించాలని..? ఇలాంటి అనేక అంశాలను టీవీ9 మీ కోసం అందిస్తోంది.
ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్-2021 పేపర్లను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. గతంలోనూ బడ్జెట్ పత్రాలను వెబ్సైట్లో పొందే వీలున్నా.. దాన్ని మరింత సులభతరం చేస్తూ, మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. ఇటీవల హల్వా వేడుక సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ‘యూనియల్ బడ్జెట్ మొబైల్ యాప్’ ను విడుదల చేశారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) దీన్ని రూపొందించింది.
బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి ప్రసంగంను ఈ యాప్‌లో ఉంటుంది.
Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!
Padma Awards: తెలంగాణ ఆదివాసీ బిడ్డకు దక్కిన అరుదైన గౌవరం.. మర్లవాయిలో అంబరాన్నంటిన సంబరాలు..