యుఎస్, కెనడాలను కప్పేసిన మంచు తుపాను

| Edited By: Anil kumar poka

Jan 20, 2020 | 10:25 AM

అమెరికా, కెనడా వంటి దేశాలను మంచు తుపాను కప్పేసింది. అమెరికాలోని షికాగో, కన్సాస్, నార్త్, సౌత్ డకోటా, న్యూయార్క్, మిన్నెసోటా  వంటి నగరాలను మంచు ముంచెత్తుతోంది. రోడ్లు, చెట్లు, భవనాలమీద మంచు దుప్పటి పరచుకుంది. ఈ దేశాల్లో అనేక ప్రాంతాలనుంచి నడపవలసిన విమాన సర్వీసులను రద్దు చేశారు. రోడ్లపై ట్రాఫిక్ ను నిషేధించారు. కన్సాస్ లో ఒకచోట రోడ్డుపై ప్రయాణిస్తున్న ట్రక్కుడ్రైవర్ మార్గం సరిగా కనబడకపోవడంతో.. తన ట్రక్కును అతివేగంగా నడుపుతూ.. కింద మంచుతో కప్పేసిన పల్లపు […]

యుఎస్, కెనడాలను కప్పేసిన మంచు తుపాను
Follow us on

అమెరికా, కెనడా వంటి దేశాలను మంచు తుపాను కప్పేసింది. అమెరికాలోని షికాగో, కన్సాస్, నార్త్, సౌత్ డకోటా, న్యూయార్క్, మిన్నెసోటా  వంటి నగరాలను మంచు ముంచెత్తుతోంది. రోడ్లు, చెట్లు, భవనాలమీద మంచు దుప్పటి పరచుకుంది. ఈ దేశాల్లో అనేక ప్రాంతాలనుంచి నడపవలసిన విమాన సర్వీసులను రద్దు చేశారు. రోడ్లపై ట్రాఫిక్ ను నిషేధించారు. కన్సాస్ లో ఒకచోట రోడ్డుపై ప్రయాణిస్తున్న ట్రక్కుడ్రైవర్ మార్గం సరిగా కనబడకపోవడంతో.. తన ట్రక్కును అతివేగంగా నడుపుతూ.. కింద మంచుతో కప్పేసిన పల్లపు భాగంలోకి చొచ్చుకుపోయాడు. అదుపు తప్పిన ఆ వాహనం దూసుకురాగా.. ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అప్రమత్తంగా ఉన్న అతగాడు ఒక్క ఉదుటున పక్కకు జంప్ చేసి గాయపడకుండా తప్పించుకోగలిగాడు. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని, ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్ఛరికలను గమనిస్తూ.. .. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటిస్తున్నారు.. స్పేస్ ఎక్స్  సంస్థ తన అత్యంత ఆధునిక రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసుకుంది. ఇక  కెనడాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. సిడ్నీ, మెల్ బోర్న్ వంటి నగరాల్లో అలర్ట్ వార్నింగ్స్ జారీ చేశారు. బ్రిటన్ లో సైతం ఇంచుమించు ఇదే వాతావరణం కొనసాగుతోంది.