అయోధ్యలో ఇక రామాలయం.. పార్లమెంటులో మోదీ అధికారిక ప్రకటన

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గాను ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఈ ట్రస్టు ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. దీనిని ‘శ్రీరామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర’ అని వ్యవహరిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. గుడి నిర్మాణం, తదితర అంశాలపై ఈ ట్రస్టు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని, ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలంతా  ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో […]

అయోధ్యలో ఇక రామాలయం.. పార్లమెంటులో మోదీ అధికారిక ప్రకటన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 05, 2020 | 12:40 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి గాను ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఈ ట్రస్టు ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. దీనిని ‘శ్రీరామ్ జన్మ భూమి తీర్థ క్షేత్ర’ అని వ్యవహరిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. గుడి నిర్మాణం, తదితర అంశాలపై ఈ ట్రస్టు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని, ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలంతా  ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ్ లాలాకు కేటాయించాలని సుప్రీంకోర్టు గత నవంబరులో చరిత్రాత్మక తీర్పు నిచ్చింది.. అలాగే ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది అని ఆయన గుర్తు చేశారు. ఇందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అటు-ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇక రెండు రోజులు మాత్రమే ఉండగా మోదీ చేసిన ఈ ప్రకటన ఎన్నికల కోడ్ ను అతిక్రమించడమే అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  ఈ ఎన్నికలు ఈ నెల 8 న జరగనున్న సంగతి తెలిసిందే.. ఆ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో ప్రకటన చేయడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.