బ్రేకింగ్: చంద్రబాబుపై ఉల్లంఘన అభియోగం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై లాక్ డౌన్ ఉల్లంఘన అభియోగం నమోదైంది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిన టీడీపీ అధినేత అడుగడుగునా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆంధ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది

  • Rajesh Sharma
  • Publish Date - 5:03 pm, Tue, 26 May 20
బ్రేకింగ్: చంద్రబాబుపై ఉల్లంఘన అభియోగం

Petition filed against Chandrababu in Andhra high court: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై లాక్ డౌన్ ఉల్లంఘన అభియోగం నమోదైంది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిన టీడీపీ అధినేత అడుగడుగునా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆంధ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబుపై లాక్ డౌన్ ఆంక్షల ఉల్లంఘన కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.

టీడీపీ అధినేత సుమారు రెండు నెలల తర్వాత హైదరాబాద్ వీడి విజయవాడ వెళ్ళిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం చంద్రబాబు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. అయితే, ఆయన అడుగడుగునా లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వంగా వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిసనర్ తరపున వాదనలు వినిపించిన అడ్వటేక్ పోనక జనార్ధన్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన చంద్రబాబుపై కేసు నమోదు చేశేలా ఏపీ పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. హైదరాబాద్ నుండి విజయవాడ మద్య భారీ కాన్వాయ్తో ప్రయాణం చేసిన చంద్రబాబు.. పలుచోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్నది ప్రధాన ఆరోపణ.

రాజకీయ ర్యాలీలపై కేంద్రం నిషేధం విధించిన అంశాన్ని గుర్తు చేసిన పిటిషనర్.. కరోనా విస్తరించేలా బాబు వ్యవహరించాడని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాది.. చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.