టర్కీ, గ్రీస్‌, బల్గేరియాలను భయపెట్టిన భూకంపం.. 14కు చేరిన మృతులు

టర్కీ, గ్రీస్‌, బల్గేరియా దేశాలను భారీ భూకంపం వణికించింది. ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ కూడా సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపంధాటికి ఇప్పటివరకూ 14 మంది మృతిచెందారు. మరో 450 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రధానంగా టర్కీలోని నాలుగో పెద్ద నగరమైన ఇజ్మిర్‌ను భూకంపం వణికించింది. 45 […]

టర్కీ, గ్రీస్‌, బల్గేరియాలను భయపెట్టిన భూకంపం.. 14కు చేరిన మృతులు
Venkata Narayana

|

Oct 31, 2020 | 8:10 AM

టర్కీ, గ్రీస్‌, బల్గేరియా దేశాలను భారీ భూకంపం వణికించింది. ఏజియన్‌ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ కూడా సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్‌ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపంధాటికి ఇప్పటివరకూ 14 మంది మృతిచెందారు. మరో 450 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రధానంగా టర్కీలోని నాలుగో పెద్ద నగరమైన ఇజ్మిర్‌ను భూకంపం వణికించింది. 45 లక్షల మంది ఈ నగరంలో నివాసముంటున్నారు. భూప్రకంపనలతో జనం వీధుల్లోకి పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి బహుళ అంతస్తు భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఏం జరుగుతుందో అర్థంకాకం జనం భయాందోళనకు గురయ్యారు. సుమారు ఆరు భవనాలు నేలమట్టమయ్యాయి. సెంట్రల్‌ ఇజ్మీర్‌లోని 20 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.  ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు నేలమట్టమయ్యాయి. భవనాలు కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టర్కీలోని ఏజియన్‌ సముద్రంలో భారీ భూకంపానికి అలలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సునామీ భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇజ్మిర్‌ సమీపంలో చిన్నపాటి సునామీ రావడంతో సముద్రపు నీరు వీధుల్లోకి వచ్చింది. పలు వాహనాలు నీళ్లలో కొట్టుకుపోయాయి. భూకంపం ధాటికి భవనాలన్నీ ఊగిపోయాయి. పాతభవనాలు కుప్పకూలాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు టర్కీ ప్రభుత్వం తెలిపింది. ఇజ్మిర్‌ ఏజియన్‌ సముద్రంలో సుమారు 16.5 కిలోమీటర్ల లోతులో రిక్టర్‌ స్కేలుపై 6.6 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.0గా ఉన్నట్లు అమెరికా జియోలాజిక్‌ సర్వే పేర్కొంది. మళ్లీ స్వల్పంగా ప్రకంపనాలు వచ్చే అవకాశం ఉందని  చెప్పింది. మరోవైపు టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోనూ భూ ప్రకంపనాలు సంభవించాయి. ప్రజలు ఇంటిని వదిలిపెట్టి రోడ్లపైకి వచ్చి నిలబడ్డారు. చాలాసేపు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతోందనని ఆందోళన చెందారు. ఐతే అక్కడ ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని ఇస్తాంబుల్‌ గవర్నర్‌ తెలిపారు. ఇక గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోనూ భూప్రకంపనలు వచ్చాయి. గ్రీస్‌కు చెందిన ద్వీపం సామోస్‌లోనూ భూకంపం రావడంతో ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అటు బల్గేరియాలోనూ భూ ప్రకంపనాలు సంభవించాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని స్థానిక మీడియా పేర్కొంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu