పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్

|

Jun 26, 2020 | 1:35 PM

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. భారత్‌లో జరిగే 2021 టీ20, 2023 వన్డే వరల్డ్ కప్‌ల కోసం తమ ప్లేయర్స్ ను పంపించాలంటూ భారత ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్
Follow us on

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. భారత్‌లో జరిగే 2021 టీ20, 2023 వన్డే వరల్డ్ కప్‌ల కోసం తమ ప్లేయర్స్ ను పంపించాలంటూ భారత ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ ఇప్పించాలని ఐసీసీని పీసీబీ కోరింది. దీనికి బీసీసీఐ గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తమకు కూడా ఓ హామీ ఇప్పించాలని డిమాండ్ చేసింది. ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేయబోమని పీసీబీ నుంచి హామీ ఇప్పించాలని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కోరారు.

భారత్​లో అక్రమ చొరబాటుదారులు రాకుండా చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పీసీబీ హామీ ఇప్పించగలదా… అలాగే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించబోమని.., భారత్​లో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేయకుండా ఉంటామని చెప్పించగలదా..? అంటూ ప్రశ్నించారు.

పీసీబీ సీఈవో వసీం ఖాన్‌కు ఐసీసీ నిబంధనలను గుర్తు చేశారు. బోర్డు విషయాల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదనే ఐసీసీ నిబంధన ఉందని, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ క్రికెట్ బోర్డు జోక్యం చేసుకోకూడదని కూడా పీసీబీ సీఈవోకు తెలియదా.. అని ఎద్దేవ చేశారు.