ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ. 1,000 జరిమానా కట్టాల్సిందే. అంతేకాదు మూడు నెలలు మీ డ్రైవింగ్ లైసెన్స్‌‌పై కూడా అనర్హత వేటు పడుతుంది.

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
Follow us

|

Updated on: Sep 15, 2020 | 11:31 AM

New Motor Act Supereme Court Guidance: ట్రాఫిక్ నిబంధనలను లైట్ తీసుకుంటున్నారా.? హెల్మెట్ ధరించడకుండా బైక్ నడుపుతున్నారా.? అయితే మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ. 1,000 జరిమానా కట్టాల్సిందే. అంతేకాదు మూడు నెలలు మీ డ్రైవింగ్ లైసెన్స్‌‌పై కూడా అనర్హత వేటు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంలో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇక ఈ రూల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

గతేడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్రం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చట్టంలో ఉన్న 11 సెక్షన్లలో జరిమానాలు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. అయితే మిగిలిన 20 సెక్షన్లలో కూడా జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం వల్ల వాటిపై కూడా వెసులుబాటు కల్పించాలని పలు రాష్ట్రాలు కోరాయి. దీనితో కేంద్రం సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వారు తప్పనిసరిగా సవరించిన చట్టాన్ని అమలు చేయాలని.. ప్రమాదాలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

ఇక ఆ 20 సెక్షన్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని.. ఎలాంటి సడలింపులు ఉండబోవని కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. దీనితో తాజాగా సవరణలకు తగ్గట్టుగా ఏపీలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవాణాశాఖ పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపగా.. సీఎం ఆమోదముద్ర పడిన వెంటనే అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసి సవరణ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. సో వాహనదారులు బీ కేర్‌ఫుల్..

Also Read:

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..