తెలుగు రాష్ట్రాల్లో హై టెన్ష‌న్..‘మర్కజ్ ప్రార్థనల’కు భారీగా వెళ్లిన జనం

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా.. ఇప్పుడు ప్రభుత్వాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం భారీ సంఖ్య‌లో తెలుగువారు వెల్లిన‌ట్టు తెలియ‌డంతో అధికారులు అల‌ర్టయ్యారు. అక్క‌డికి వెళ్లిన‌వారితో పాటు వారితో స‌న్నిహితంగా మెలిగినవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కాగా తెలంగాణలోని కోవిడ్ మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ కూడా ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ నుంచి 280 మంది […]

తెలుగు రాష్ట్రాల్లో హై టెన్ష‌న్..‘మర్కజ్ ప్రార్థనల’కు భారీగా వెళ్లిన జనం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 31, 2020 | 9:31 AM

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా.. ఇప్పుడు ప్రభుత్వాల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం భారీ సంఖ్య‌లో తెలుగువారు వెల్లిన‌ట్టు తెలియ‌డంతో అధికారులు అల‌ర్టయ్యారు. అక్క‌డికి వెళ్లిన‌వారితో పాటు వారితో స‌న్నిహితంగా మెలిగినవారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కాగా తెలంగాణలోని కోవిడ్ మరణాలు ఒక్కసారిగా ఆరుకు చేరాయి. ఈ ఆరుగురూ కూడా ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడంతో తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ నుంచి 280 మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది.

అందుతోన్న ప్ర‌కారం తెలంగాణ నుంచి ప్రాంతాల వారీగా మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న‌వారు:

హైదరాబాద్ 186 మెదక్ 26 వరంగల్ 25 నల్గొండ 21 నిజామాబాద్ 18 కరీంనగర్ 17 రంగారెడ్డి 15 ఖమ్మం 15 నిర్మల్ 11 భైంసా 11 ఆదిలాబాద్ 10

కాగా ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన‌వారు వెంట‌నే తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంవో కోరింది. వారికి ఉచితంగా టెస్టుల చేయించి, వైద్య సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన ఈ ప్రార్థనల్లో 2000 మంది పాల్గొనగా.. అందులో ఇత‌ర దేశాల‌కు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రేయ‌ర్స్ లో పాల్గొన్నారు.

మ‌రోవైపు ప్రార్థ‌న‌ల కోసం ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారిలో ఏపీకి చెందినవారు 711 మంది ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. 13 జిల్లాల నుంచి కూడా భ‌క్తుల అక్కడికి వెళ్లిన‌ట్టు స‌మాచారం. కొన్ని జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసులకు మూలాలు దిల్లీ వెళ్ళొచ్చిన వారేనని అధికార వ‌ర్గాలు తెలుపుతున్నాయి. వీరిలో ఆస్ప‌త్రి క్వారంటైన్ లో 122 మంది, ప్రభుత్వ క్వారంటైన్ లలో మరో 207 మంది ఉన్నారు.హోమ్ క్వారంటైన్ లో మరో 297 మంది ఉన్నారు. ఇంకా ఆచూకీ తెలియని 85 మంది.. డేటాను సేకరిస్తున్న పోలీసులు, వైద్యాధికారులు సేక‌రిస్తున్నారు.

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.