రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్.. ఎంతో తెలుసా..?

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 11 లక్షల పైగా రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అయితే గత ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు ప్రతియేటా బోనస్ ఇస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. రైల్వేలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఇక ముందు కూడా […]

రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్.. ఎంతో తెలుసా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 18, 2019 | 6:08 PM

రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దసరా పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 11 లక్షల పైగా రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అయితే గత ఆరేళ్ల నుంచి రైల్వే ఉద్యోగులకు ప్రతియేటా బోనస్ ఇస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. రైల్వేలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఇక ముందు కూడా అలాగే రావాలని ఆయన ఆశించారు. రైల్వే ఉద్యోగులకు ఇది ఒక అవార్డులాంటిదన్నారు.