వారిద్దరి స్నేహాన్ని ఒక తండ్రిగా గౌరవిస్తా.. బోనీ కపూర్

I Respect My Daughter's Friendship Boney Kapoor, వారిద్దరి స్నేహాన్ని ఒక తండ్రిగా గౌరవిస్తా.. బోనీ కపూర్

సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లో స్నేహాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవీ కపూర్ తన కో స్టార్ ఇషాన్ కట్టర్‌తో లవ్‌లో ఉందని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. వీరిద్దరూ చాలా క్లోజ్ మూవ్ అవుతున్న విషయంపై సోషల్‌మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ఆన్ స్క్రీన్‌మీద అంతగా దగ్గరయ్యారు. నిజ జీవితంలో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరిపై వస్తున్న వార్తల్ని తోసిపుచ్చారు బోనీ కపూర్ . జాహ్నవీ-ఇషాన్‌ల స్నేహాన్ని తాను గౌరవిస్తానని బోనీ కపూర్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

మరోవైపు తెలుగులో విజయ్ దేవరకొండ లేటెస్ట్ హిట్ మూవీ “డియర్ కామ్రేడ్” హిందీ రీమేక్‌లో జాహ్నవీ, ఇషాన్ కలిపి చేస్తున్నారని ఈ మూవీ కరణ్‌జోహార్ సారధ్యంలో రాబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటివరకు “డియర్ కామ్రేడ్” మూవీ హిందీ రీమేక్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక జరగలేదని కరణ్‌జోహార్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. జాహ్నవీ కపూర్, ఇషాన్ కట్టర్ తొలిచిత్రం” ధడక్” మూవీతో బాలీవుడ్‌లో సంచలనానికి తెరతీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *