మొబైల్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్..!..ఇక ఉచితాలకు బ్రేకులే..?

  మొబైల్ ఫోన్.. ప్రస్తుతం మనిషి జీవితంలో విడదీయరాని బంధం కలిగిన పరికరం. దూరంగా ఉన్న వ్యక్తులను మాటలతో దగ్గర చేసే సాధనం. అయితే తొలుత దీనిని ఉపయోగించడం అంటే ఓ స్టేటస్‌గా ఉండేది. దీనికి కారణం అప్పటి కాల్స్‌ ధరలు. నిమిషానికి రూపాయల్లో ఉండేది. అంతేగాక.. నెలసరి అద్దె కూడా ఎక్కువే ఉండేది. కానీ క్రమేణా.. దాని ధరలు మెల్లిగా తగ్గుకుంటూ.. రూపాయల నుంచి పైసల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో మొబైల్ వినియోగం సామాన్యుడికి చేరువైంది. […]

మొబైల్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్..!..ఇక ఉచితాలకు బ్రేకులే..?
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2019 | 10:40 PM

మొబైల్ ఫోన్.. ప్రస్తుతం మనిషి జీవితంలో విడదీయరాని బంధం కలిగిన పరికరం. దూరంగా ఉన్న వ్యక్తులను మాటలతో దగ్గర చేసే సాధనం. అయితే తొలుత దీనిని ఉపయోగించడం అంటే ఓ స్టేటస్‌గా ఉండేది. దీనికి కారణం అప్పటి కాల్స్‌ ధరలు. నిమిషానికి రూపాయల్లో ఉండేది. అంతేగాక.. నెలసరి అద్దె కూడా ఎక్కువే ఉండేది. కానీ క్రమేణా.. దాని ధరలు మెల్లిగా తగ్గుకుంటూ.. రూపాయల నుంచి పైసల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో మొబైల్ వినియోగం సామాన్యుడికి చేరువైంది. అదే సమయంలో దీని ఉపయోగం కూడా పెరిగింది. దీనికి కారణం సామాన్యుడికి అందుబాటులో కాల్స్, ఇంటర్నెట్ ధరలు రావడం.

అయితే గత కొద్ది రోజులుగా టెలికాం రంగంలో మళ్లీ మార్పులు వస్తున్నాయి. క్రమక్రమంగా వినియోగ దారుల నడ్డీ విరిచేలా.. ధరల్ని మెల్లిగా పెంచుతూ.. తెలియకుండానే పెంచేస్తున్నాయి కంపెనీలు. అందులో ముఖ్యంగా ఇటీవల ఉచితం పేరుతో పరిచయమై.. తాజాగా పైసలు వసూలు చేస్తున్న జియో ఒకటి. అయితే జియో ప్రారంభంలో ఇచ్చిన ఆఫర్లకు కస్టమర్లు విపరీతంగా ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో జియో పోటీ నుంచి కస్టమర్లను కాపాడుకునేందుకు ఇతర ఆపరేటర్లు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో ముఖ్యంగా అన్‌ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, తక్కువ ధరకే డేటా ఇవ్వడం వంటి పథకాలతో కస్టమర్లను చేజారకుండా కాపాడుకోగలిగారు. అయితే ఇవే ఇప్పుడు ఈ కంపెనీలకు భారంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. మొబైల్ కంపెనీలు వినియోగ దారులకు భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే.

ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టెలికం కంపెనీలు రూ. 92,500 కోట్లకు పైగా కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలు ఏం నిర్ణయం తీసుకుంటాయోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కంపెనీలను ఈ కష్టాల నుంచి బయటపడేసేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే ఉంది. దీనిని పరిశీలించేందుకు ప్రభుత్వం… కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గుబా ఆధ్వర్యంలో కార్యదర్శుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సర్వీస్ ప్రొవైడర్లు.. ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్ళ వెనుక గల అసలు కారణాలను పరిశీలించి, వీటి సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు రెడీ చేయాలని కమిటీని కేంద్రం కోరింది. ఈ కమిటీ సిఫార్సులు త్వరలో ప్రభుత్వానికి అందనున్నాయి. వాయు తరంగాల వినియోగ ఛార్జీల తగ్గింపుతో పాటుగా మరిన్ని డిమాండ్లను ఈ ప్యానెల్ పరిశీలిస్తోంది. మరోవైపు ట్రాయ్ కూడా ఈ అంశాలను పరిశీలిస్తోంది.

ఇక టెలికాం కంపెనీలు మాత్రం.. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటాను తగ్గించాలని కోరుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో స్పెక్ట్రం చెల్లింపులపై మార్చి 2022 వరకు… అంటే రెండేళ్ల పాటు మారటోరియం ఉండాలని భావిస్తున్నాయి. అలాగే లైసెన్స్ ఫీజును ఎనిమిది శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని.. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌ను రెండు శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.

కాగా, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ… ఈ టెలికం ఆపరేటర్ల ఆదాయం పెరిగే దారులను అన్వేషించనుంది. ఈ క్రమంలో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు ఇస్తోన్న ఉచిత ఆఫర్లను వెనక్కు తీసుకోవాలన్న అంశాన్ని కమిటీ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా టెలికం కంపెనీల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న ఈ ఫ్రీ కాల్స్, తక్కువ ధరకు ఇస్తున్న డేటా ఆఫర్లను ఆపేయాలని కేంద్రానికి కమిటీ నివేదిక ఇవ్వొచ్చని తెలుస్తోంది. అంతేకాదు కమిటీ నివేదికల తర్వాత.. బెయిలవుట్ ప్యాకేజీ కింద టెలికం సంస్థలకు ప్రభుత్వం ఈ మేరకు సూచనలు చేయవచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాయిస్ కాల్స్, డేటా సర్వీసులకు మినిమం చార్జీలను కూడా ట్రాయ్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. ఇక ఉచిత కాల్స్, డాటా ఆఫర్లకు బ్రేకులు పడ్డట్లే.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ