ముస్కో పరిశ్రమలో భారీ పేలుడు..!

సంగారెడ్డి జిల్లా బూచినెల్లి పారిశ్రామికవాడలోని ముస్కో పరిశ్రమలో గురువారం అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ముస్కో పరిశ్రమలో వెల్డింగ్ పనులకు ఉపయోగించే గ్యాస్ సిలెండర్ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. పేలుడు ధాటికి బిల్డింగ్ విభాగంలో పైకప్పు.. ముక్కముక్కలైంది. […]

ముస్కో పరిశ్రమలో భారీ పేలుడు..!
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 12:02 PM

సంగారెడ్డి జిల్లా బూచినెల్లి పారిశ్రామికవాడలోని ముస్కో పరిశ్రమలో గురువారం అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ముస్కో పరిశ్రమలో వెల్డింగ్ పనులకు ఉపయోగించే గ్యాస్ సిలెండర్ వల్లే ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. పేలుడు ధాటికి బిల్డింగ్ విభాగంలో పైకప్పు.. ముక్కముక్కలైంది. అయితే.. ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. ఘటన సమయంలో అక్కడ ఎంత మంది కార్మికులు ఉన్నారు..? మిగిలినవాళ్లు సురక్షితంగా ఉన్నారా..? లేదా అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు.