హ్యాట్సాఫ్.. ఆపదలో ఉన్న పేషెంట్లకు రక్తదానం చేస్తున్న వైద్యులు..

వైద్యో నారాయణో హరి.. అంటారు పెద్దలు. ఆ సామెతను అక్షర సత్యం చేస్తున్నారు బీహార్ వైద్యులు. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా.. బీహార్‌లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడుతోంది.

హ్యాట్సాఫ్.. ఆపదలో ఉన్న పేషెంట్లకు రక్తదానం చేస్తున్న వైద్యులు..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 5:01 PM

వైద్యో నారాయణో హరి.. అంటారు పెద్దలు. ఆ సామెతను అక్షర సత్యం చేస్తున్నారు బీహార్ వైద్యులు. వివరాల్లోకి వెళితే.. గత కొద్ది రోజులుగా.. బీహార్‌లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఏర్పడుతోంది. దీంతో రోగులకు వైద్యం అందించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఏదురవుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు కరోనాతో రోగులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సాధారణ కేసుల్లో.. సర్జరీ చేసే సమయంలో కూడా కొందరు పేషంట్లకు రక్తం అవసరం పడుతుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఏకంగా మెడికోలే ముందుకు వచ్చి రక్తం దానం చేస్తూ.. పేషంట్ల ప్రాణాలను కాపాడుతున్నారు. దీంతో వైద్యాధికారులు యువతకు రక్తం దానం చేయాలని కోరుతున్నారు. త్వరగా.. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వాలు పెంచుకోవాలని.. లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

కాగా, ఇప్పటికే బీహార్‌లో 7వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 2వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో ఐదు వేల మంది వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 50 మంది కరోనా బారినపడి మరణించినట్లు బీహార్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.