పెరూలో ఘోరం… నాటి చిన్నారుల కథ విషాదం

అది దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతం.. అక్కడ ఒకే రోజు 227 మంది పిల్లలను బలి ఇచ్చారు. ఈ దారుణం ఈ నాటిది కాదు. 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఆ నాడు చిమో రాజుల పాలనలో ప్రకృతి వైపరీత్యాలు తమ సామ్రాజ్యాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే చిన్న పిల్లలను బలి ఇవ్వాలనే ఆచారం ఉండేదట. దీంతో వందలాది చిన్నారులను బలి ఇచ్చి ఒకేచోట ఖననం చేసి ఉంటారని ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్టులు అంటున్నారు. […]

పెరూలో ఘోరం... నాటి చిన్నారుల కథ విషాదం
Follow us

|

Updated on: Aug 28, 2019 | 2:55 PM

అది దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతం.. అక్కడ ఒకే రోజు 227 మంది పిల్లలను బలి ఇచ్చారు. ఈ దారుణం ఈ నాటిది కాదు. 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఆ నాడు చిమో రాజుల పాలనలో ప్రకృతి వైపరీత్యాలు తమ సామ్రాజ్యాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే చిన్న పిల్లలను బలి ఇవ్వాలనే ఆచారం ఉండేదట. దీంతో వందలాది చిన్నారులను బలి ఇచ్చి ఒకేచోట ఖననం చేసి ఉంటారని ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్టులు అంటున్నారు. ఈ చిన్నారుల వయస్సు నాలుగేళ్ల నుంచి పద్నాలుగేళ్ల మధ్య ఉండవచ్ఛునని అంచనా వేశారు. ఈ తవ్వకాల్లో బయటపడిన సమాధుల్లో కొంతమంది పిల్లల మృత దేహాలపై చర్మం, వెంట్రుకలు అలాగే ఉన్నాయట. వారి చెవులకు వెండి పోగులు కూడా ఉన్నాయని ఆర్కియాలజిస్టులు పేర్కొన్నారు. ఏమైనా.. దుష్ట శక్తుల నుంచి బయటపడాలంటే ఎక్కడో ఆఫ్రికా వంటి దేశాల్లో ఇలాంటి మూఢ నమ్మకాలుండేవి. కానీ వీటికి ఏ దేశమూ, ప్రాంతమూ అతీతం కాదని దీంతో తెలుస్తోంది.

Pweru 2Peru 3