ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..బిగ్ బాస్ ఫేమ్ నందిని సంచలన కామెంట్స్..
చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది బిగ్‌బాస్ ఫేమ్, నటి నందినిరాయ్.
చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది బిగ్‌బాస్ ఫేమ్, నటి నందినిరాయ్. ఇటీవలే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆ విషయంపై మాట్లాడుతూ తన డిప్రెషన్‌కు సంబంధించిన విషయాల్ని వెల్లడించింది.
“2011లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. 2015లో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడం వల్ల పూర్తిగా నిరాశచెందాను. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. ఒకానొక సమయంలో ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను. దాదాపు రెండేళ్లపాటు మానసిక వ్యధ అనుభవించాను. అయితే బిగ్‌బాస్ సెకండ్ సీజన్లో పాల్గొని వచ్చిన తర్వాత నన్ను నేను దృఢంగా మలుచుకున్నాను. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ఉండేదాన్ని. వైద్యుల వద్ద కౌన్స్లింగ్లు తీసుకునేదాన్ని. ఇలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను” అని నందిని రాయ్ పేర్కొన్నారు.