Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

Bigg boss 3 Telugu: శిల్ప చక్రవర్తి ఎలిమినేట్‌

Shilpa Chakravarthy Eliminated From Bigg Boss 3 Telugu, Bigg boss 3 Telugu: శిల్ప చక్రవర్తి ఎలిమినేట్‌

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’. నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..ముందు నుంచి కాంట్రవర్సీలతో ఆడియెన్స్‌లో ఆసక్తి రేపుతూ వస్తోంది. ఈ షో ఇప్పటికే 57 ఎఫిసోడ్లు పూర్తయింది.  కాగా ఈ వీక్  ఎలిమినేషన్ ఎవరవుతారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.

ఇటీవల వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన యాంకర్‌, నటి శిల్ప చక్రవర్తి ఎలిమినేట్‌ అయ్యారు. శిల్ప రాకతో బిగ్‌బాగ్‌ షో మరింత ఆసక్తికరంగా మారుతుందని అందరూ భావించారు. అయితే, ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. హౌస్‌లోకి ప్రవేశించిన తొలివారం నామినేషన్‌ ప్రక్రియ నుంచి మినహాయింపు లభించగా, ఆ మరుసటి వారమే ఆమె నామినేట్‌ కావడం విశేషం. శిల్పతో పాటు శ్రీముఖి, హిమజ, మహేశ్‌ విట్టా, పునర్నవిలు కూడా నామినేట్‌ అయ్యారు. అయితే, ప్రేక్షకుల నుంచి శిల్పకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున వెల్లడించారు.

ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్‌‌కు మంచి టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి, శిల్పాచక్రవర్తిలకు ఇచ్చిన టాస్క్ హౌస్‌లో నవ్వులు పూయించింది. ముఖ్యంగా శ్రీముఖి.. మగ గొంతుతో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. మరోవైపు మహేష్ విట్టా.. శ్రీముఖిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన తీరు నవ్వు తెప్పించింది. మరోవైపు శ్రీముఖి, వితిక షేరు, బాబా భాస్కర్ తిరుమల ఎపిసోడ్ కూడా హౌస్‌లో మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ బిగ్‌బాస్‌ సీజన్‌3లో ఎలిమినేట్‌ అయిన వారందరూ తొలిసారి నామినేట్‌ అయిన సభ్యులే కావడం గమనార్హం.