Breaking News
  • కరోనా అప్డేట్ తెలంగాణలో ఇవాళ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 487 కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • మై హోం గ్రూప్ సంస్ధల విరాళం. కరోనా ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రామ్, శ్యామ్ రావు .
  • అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్... వెంటనే ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • ఈరోజు ముంబై లో 218 కరోనా పాజిటివ్ కేస్ లు, 10 మంది మృతి ఇప్పటి వరకు ముంబై లో 993 చేరిన కరోనా పాజిటివ్ కేసులు.
  • భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని తేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. గతంలో ఇచ్చిన నివేదికలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందని పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ. అది పొరపాటుగా అంగీకరిస్తూ సవరణ చేసిన డబ్ల్యూహెచ్ఓ. దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులున్నాయని వివరణ.

బిగ్ బాస్: ప్రియాంక మరిది అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు!

Priyanka Gandhi Cousin Tehseen Poonawalla's Surprising Eviction In Bigg Boss 13, బిగ్ బాస్: ప్రియాంక మరిది అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు!

హిందీలో బిగ్ బాస్ 13వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో.. పలు వివాదాల మధ్య విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక కంటెస్టెంట్లు… గొడవలు, రొమాన్స్, మాటల యుద్ధాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారవేత్తగా, సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ పూనావాలా వైల్డ్ కార్డు ఎంట్రీగా షోలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడే ఈ సీజన్ హయ్యెస్ట్‌ పెయిడ్ కంటెస్టెంట్‌గా కూడా నిలిచాడు. కాగా ఇతడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి వరుసకు మరిది కావడం విశేషం. ఇంతటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి కొద్దిరోజులు హౌస్‌లో ఉండి ప్రేక్షకులను అలరిస్తాడని అందరూ భావించారు.. అయితే అతడు ఈవారం అర్ధాంతరంగా ఎలిమినేట్ అయ్యాడు.

సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌లతో పలుమార్లు గొడవ పడ్డ తెహ్సీన్ ఇలా సడన్‌గా ఎలిమినేషన్‌కు గురి కావడంతో మిగతా హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే తెహ్సీన్ మధ్యలోనే హౌస్ నుంచి బయటికి రావడం వెనుక బలమైన కారణం ఒకటుందని అతని న్యాయవాదులు తెలిపారు. తెహ్సీన్‌కు సంబంధించిన సున్నితమైన వ్యవహారం ఒకటి ఉండటం వల్లే అతడు బయటికి రావాల్సి వచ్చిందని వారు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆ మేటర్‌పై తెహ్సీన్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎలిమినేషన్ తర్వాత తాజాగా తెహ్సీన్ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఉన్నది తక్కువ రోజులైనా.. తన బిగ్ బాస్ జర్నీ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు.  ఎప్పుడూ సురక్షితమైన జోన్‌లో ఉండే తాను ఆ పరిధి ధాటి కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామని చూశానని.. అందుకే బిగ్ బాస్‌ హౌస్‌కి వచ్చానని చెప్పాడు.

ఇక సిద్ధార్థ్ శుక్లా, అసిమ్ రియాజ్‌లతో ఉన్న గొడవలపై కూడా స్పందించిన తెహ్సీన్.. మా ముగ్గురి మధ్య ఉన్న ఫైట్స్ కేవలం తాత్కాలికమేనని తెలిపాడు. మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటామని చెప్పుకొచ్చాడు. తాను హౌస్‌లో ఉన్నది తక్కువ సమయం అయినా.. ప్రేక్షకులు తనపై ప్రేమను కురిపించారని చెప్పాడు.

Related Tags