ఢిల్లీకి మండలి రద్దు బిల్లు..జాతీయ పార్టీల వైఖరేంటి..?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిని రద్దుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169 ప్రకారం మూడింట రెండొంతుల కన్నా ఎక్కువ మెజార్టీతోనే సభ తీర్మానం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టి తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఓటేయలేదు. సభలో వైసీపీకి 151 మంది బలం ఉంది. స్పీకర్‌ను తీసేస్తే 150 మంది. జనసేన ఎమ్మెల్యే రాపాక కూడా రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. మొత్తం 133 ఓట్లు పడ్డాయి. కొందరు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. […]

ఢిల్లీకి మండలి రద్దు బిల్లు..జాతీయ పార్టీల వైఖరేంటి..?
Follow us

|

Updated on: Jan 27, 2020 | 10:39 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిని రద్దుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169 ప్రకారం మూడింట రెండొంతుల కన్నా ఎక్కువ మెజార్టీతోనే సభ తీర్మానం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టి తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఓటేయలేదు. సభలో వైసీపీకి 151 మంది బలం ఉంది. స్పీకర్‌ను తీసేస్తే 150 మంది. జనసేన ఎమ్మెల్యే రాపాక కూడా రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. మొత్తం 133 ఓట్లు పడ్డాయి. కొందరు వైసీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. టీడీపీ సభకు దూరంగా ఉంది. శాసనసభ బిల్లును కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత మండలి రద్దవుతుంది. దీంతో బాల్ ఇప్పుడు కేంద్రం పరిధిలోకి వెళ్లింది. మరీ అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ మండలి రద్దు తీర్మానంపై ఎలా స్పందించనుంది అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదే అంశంపై వారి నెక్ట్స్ స్టెప్ ఏంటో చెప్పాలని బిగ్ న్యూస్-బిగ్ డిబేట్ వేదికగా బీజేపీ నేత రఘురాంను స్ట్రయిట్‌గా ప్రశ్నించారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. అయితే దీనిపై ఆయన దాటవేసే దోరణిలో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాజ్యసభలో కేంద్రానికి 23 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం తమ దృష్టి అంతా బడ్జెట్‌పైనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి సైతం తమ వెర్షన్‌ను వినిపించారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ నాయకులుగా ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని, పార్లమెంట్ వద్దకు బిల్లు వెళ్లినప్పుడు..జాతీయ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై నేషనల్ పార్టీల వెర్షన్ దిగువ వీడియోలో మీరే వినండి.