Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 58 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం. ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్న రెండో రోజు మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న టీడీపీ.
  • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేలు ,ప్రతిపక్ష నేత చంద్రబాబు ,లోకేష్ ల పై హైకోర్టులో వేసిన పిల్స్ పై ముగిసిన విచారణ . మూడుగంటల పాటు కొనసాగిన వాదనలు . తీర్పుని వెలువరించిన ధర్మాసనం . డిజార్డర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఫాలో కావాలని సూచన . సంబంధిత శాఖకు పిర్యాదు చేయకుండా నేరుగా హై కోర్టులో పిల్ వేయటాన్ని తప్పు పట్టిన ధర్మాసనం .
  • అమరావతి హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు ఏడుగురు పై కేసులు నమోదు చేసిన సీఐడీ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. విచారణకు హాజరు కావాలని పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ..
  • హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇవాళ 107 పాజిటివ్ కేసులు నమోదు. * సౌదీ అరేబియా 49, వలస కార్మికులు 19 పాజిటివ్ కేసులు నమోదు. ఇవ్వాళ కొత్తగా 6మంది మృతి. ఇప్పటి వరకు మొత్తం 64కి చేరిన మృతుల సంఖ్య. ఇవాళ 37 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి.

ఆశ్చర్యపరిచే అంశాలతో బోస్టన్ నివేదిక

bostan group report on capital, ఆశ్చర్యపరిచే అంశాలతో బోస్టన్ నివేదిక

అందరూ ఎదురు చూసిన బోస్టన్ గ్రూపు నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరిపోయింది. నివేదికాంశాలను పరిశీలిస్తే ఆశ్చర్యపోయే అంశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఓ వైపు ఉద్యమం రగులుకుంటూనే వున్న తరుణంలో రాజధాని అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రభుత్వానికి నివేదిక అంద జేసింది. బీసీజీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి నివేదిక అందజేశారు.

రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను బీసీజీ తమ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం అందుతోంది. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితులను వివరించిన బీసీజీ.. ప్రాంతాల వారీగా ఎంచుకోవాల్సిన అభివృద్ధి వ్యూహాలను వివరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, టూరిజం, మత్స్య రంగాల్లో ప్రణాళికలను బోస్టన్ నివేదికలో ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, వాటి ఆర్థిక పనితీరును నివేదికలో ప్రస్తావించిన బీసీజీ.. అవన్నీ అనుకున్న లక్ష్యాలను సాధించాయా? లేదా? అన్నదానిపై గణాంకాలతో తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

bostan group report on capital, ఆశ్చర్యపరిచే అంశాలతో బోస్టన్ నివేదిక

ప్రపంచంలోని వివిధ దేశాల బహుళ రాజధానులు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బహుళ రాజధానులు, బహుళ రాజధాని కార్యకలాపాల కేంద్రాలపై నివేదికలో ప్రస్తావించారు బోస్టన్ ప్రతినిధులు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించిన బీసీజీ.. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలను స్పష్టంగా తెలియచేసిందని చెబుతున్నారు. రాష్ట్రం సత్వరంగా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. అదే సమయంలో సత్వర ఫలితాల సాధనకు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని బీసీజీ నివేదికలో కూలంకషంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

బోస్టన్ నివేదికపై జనవరి ఆరో తేదీన రాష్ట్ర హైపవర్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు విడతలుగా బోస్టన్, జీఎన్ రావు నివేదికలపై హైపవర్ కమిటీ భేటీ అవుతుందని, ఈనెల మూడో వారంలో హైపవర్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. ఈలోగా జనవరి 8వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలోను బోస్టన్ గ్రూపు ఇచ్చిన నివేదికను ఎజెండాగా చేరుస్తారని, గత కేబినెట్‌లో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించిన విధంగానే జనవరి 8న జరిగే కేబినెట్ భేటీలోను బోస్టన్ గ్రూపు నివేదికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Related Tags