బంగ్లాదేశ్….భారతీయ యువతి అరెస్ట్.. ఎందుకంటే ?

బంగ్లాదేశ్ లో పాతికేళ్ల ఆయేషా జన్నత్ మొహానా అనే యువతిని అక్కడి కౌంటర్ టెర్రరిజం పోలీసులు అరెస్టు చేశారు. నిషిధ్ధ జమాత్ ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ అన్న ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో యువతులను,.బాలికలను ఈమె..

బంగ్లాదేశ్....భారతీయ యువతి అరెస్ట్.. ఎందుకంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 18, 2020 | 2:07 PM

బంగ్లాదేశ్ లో పాతికేళ్ల ఆయేషా జన్నత్ మొహానా అనే యువతిని అక్కడి కౌంటర్ టెర్రరిజం పోలీసులు అరెస్టు చేశారు. నిషిధ్ధ జమాత్ ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ అన్న ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో యువతులను,.బాలికలను ఈమె రిక్రూట్ చేసుకుంటోందట. . భారత దేశానికి చెందిన జన్నత్ వద్ద భారతీయ పాస్ పోర్టు ఉన్నట్టు కనుగొన్నారు. ఈమెను కోర్టులో హాజరు పరచగా నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. వెస్ట్ బెంగాల్ లోని హుగ్ల్లీ జిల్లాకు చెందిన జన్నత్.. అసలు పేరు ప్రగ్యా దేవ్  నాథ్ అని,  2009 లో ఆమె ఇస్లాంలో చేరిందని తెలిసింది. ఆన్ లైన్ ద్వారా మతపరమైన పాఠాలను వింటూ క్రమంగా ఈమె ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితురాలైంది. 2016 లో  జమాత్ ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ మహిళా విభాగం చీఫ్ ఆస్మా ఖాతూన్ ఈమెను తమ సంస్థలో చేర్చుకుని.. యువతులు, బాలికలను రిక్రూట్ చేసుకునే బాధ్యతను ఈమెకు అప్పగించింది. అయితే ఆస్మా ఖాతూన్ ని పోలీసులు అరెస్టు చేయడంతో జన్నత్ టీచర్ అవతారమెత్తి ఆ ముసుగులో క్రమంగా తానే ఈ సంస్థకు ‘డీ-ఫ్యాక్టో’ చీఫ్ అయింది. నకిలీ పేర్లతో ఈమె ఎన్నోసార్లు బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కి   ప్రయాణించేదని తెలిసింది.

,