బాప్‌రే! ట్వీట్ల కాపీ మాస్టర్ సౌమ్య సర్కార్..

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత్ ఆటగాడు యువరాజ్ సింగ్‌కు.. అటు మాజీ క్రికెటర్లు, ఇటు యంగ్ క్రికెటర్లు సైతం అతడి రికార్డ్స్ గుర్తు చేస్తూ ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా యువీకి అభిమాని అయిన బంగ్లా క్రికెటర్ సౌమ్య సర్కార్ ఫేస్‌బుక్ వేదికగా అతనికి అభినందనలు తెలిపాడు. ‘థాంక్యూ పాజీ.. నేను చూసిన వారిలో నువ్వొక అద్భుతమైన ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌వి. నేనెప్పుడూ నీ స్టైల్, బ్యాటింగ్‌ను […]

బాప్‌రే! ట్వీట్ల కాపీ మాస్టర్ సౌమ్య సర్కార్..
Follow us

|

Updated on: Jun 14, 2019 | 5:28 PM

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత్ ఆటగాడు యువరాజ్ సింగ్‌కు.. అటు మాజీ క్రికెటర్లు, ఇటు యంగ్ క్రికెటర్లు సైతం అతడి రికార్డ్స్ గుర్తు చేస్తూ ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా యువీకి అభిమాని అయిన బంగ్లా క్రికెటర్ సౌమ్య సర్కార్ ఫేస్‌బుక్ వేదికగా అతనికి అభినందనలు తెలిపాడు. ‘థాంక్యూ పాజీ.. నేను చూసిన వారిలో నువ్వొక అద్భుతమైన ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌వి. నేనెప్పుడూ నీ స్టైల్, బ్యాటింగ్‌ను అనుసరించాలని ప్రయత్నిస్తాను. నిన్ను చూసి నేనెంతో నేర్చుకున్నాను. నీ కొత్త జర్నీ అంతా సాఫీగా సాగాలని కోరుకుంటాను’ అని పోస్ట్ చేశాడు.

అయితే ఈ బంగ్లా క్రికెటర్ తన పోస్ట్‌లో రాసుకున్న వ్యాఖ్యలు దాదాపు భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన ట్వీట్ మాదిరి ఉండటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సౌమ్య సర్కార్ కాపీ కొట్టాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే శిఖర్ ధావన్.. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే ట్వీట్ చేయగా.. సౌమ్య సర్కార్ మాత్రం ఆ తర్వాత రోజు పోస్ట్ చేశాడు.

మరోవైపు యువరాజ్ సింగ్.. ఈ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.