చంద్రబాబు నోట బాలకృష్ణ డైలాగ్

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నోట ఆయన వియ్యంకుడు బాలకృష్ణ డైలాగ్ వచ్చింది. అమరావతిలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా ఈ డైలాగ్ చెప్పారు. మీడియా సమావేశానికి కొందరు విలేఖర్లు ఇంకా రాకపోవడంతో కొంత సమయం పాటు చంద్రబాబు వెయిట్ చేశారు. ఈ సమయంలో విలేఖర్లతో ఆయన సరదగా గడిపారు. ఈ సమయంలో ఆయన తర వియ్యంకుడు, ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ పలికిన పాపులర్ డైలాగ్‌ను చెప్పి ఆహ్లాదకర వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ‘కాలం […]

చంద్రబాబు నోట బాలకృష్ణ డైలాగ్
Follow us

|

Updated on: Mar 13, 2019 | 6:10 PM

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నోట ఆయన వియ్యంకుడు బాలకృష్ణ డైలాగ్ వచ్చింది. అమరావతిలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా ఈ డైలాగ్ చెప్పారు. మీడియా సమావేశానికి కొందరు విలేఖర్లు ఇంకా రాకపోవడంతో కొంత సమయం పాటు చంద్రబాబు వెయిట్ చేశారు.

ఈ సమయంలో విలేఖర్లతో ఆయన సరదగా గడిపారు. ఈ సమయంలో ఆయన తర వియ్యంకుడు, ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ పలికిన పాపులర్ డైలాగ్‌ను చెప్పి ఆహ్లాదకర వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ‘కాలం లేదు మిత్రమా’ అంటూ బాలకృష్ణ పాపులర్ డైలాగ్ అయిన సమయం లేదు మిత్రమా అన్న తరహాలో చెప్పారు. దీంతో రిపోర్టర్లు అంతా ఒక్కసారిగా నవ్వారు.

ఇకపై మాటలు లేవు, బుల్లెట్‌లా దూసుకుపోవడమే అంటూ తన ప్రసంగాన్ని చంద్రబాబు మొదలు పెట్టారు. మీరు టేక్ రెడీ అంటేనే మేం మాట్లాడటం మొదలు పెడతాం అంటూ విలేకరులతో ఆయన చమత్కరించారు.