Breaking News
  • చిత్తూరు: పలమనేరు మండలం మండిపేటలో ఎనుగుల విధ్వంసం. పంటపొలాలపై దాడి, కొబ్బరి చెట్లు ధ్వంసం. పశువులపైనా దాడి చేసిన గజరాజులు. దూడ మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలు. భయాందోళనలో రైతులు.
  • ప.గో: భీమడోలు మండలం పొలసానిపల్లిలో హత్యాయత్నం. భర్తను చంపేందుకు యత్నించిన భార్య. కూరలో సైనైడ్‌ కలిపి భర్తకు వడ్డించిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గురునాథ్‌. భార్య రాణి, కొడుకు సహా మరోముగ్గురిపై కేసు నమోదు.
  • హైదరాబాద్‌: పంజాగుట్టలో దొంగల బీభత్సం. అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళలు. ఓ మహిళపై సుత్తితో దాడి చేసిన దొంగ. మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • సెల్ఫ్‌ డిసిప్లేన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైన్‌లు వేసినంత మాత్రానా మార్పు రాదు. వాహనదారులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. బయోడైవర్సిటీ ప్రమాదం తర్వాత అనేక చర్యలు చేపట్టాం. వాహనదారుల్లో మార్పు రాకుంటే నిర్దిష్ట వేగాన్ని కఠినంగా అమలు చేస్తాం. వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేవారు కూడా నష్టపోతున్నారు -టీవీ9తో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.
  • ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత. రెండు రోజుల క్రితం అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థి మృతదేహం లభ్యం. గోపాలపురం దగ్గర ఎన్‌ఎస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు. మృతదేహంతో కలెక్టరేట్‌ దగ్గర బంధువుల ఆందోళన.
  • అమరావతి: ఐటీ దాడుల పూర్తి పంచనామా రిపోర్ట్‌ విడుదల. భారీగా డైరీలు, రిజిస్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఐటీశాఖ. కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్‌. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన లాకర్లు సీజ్‌ చేసినట్టు పంచనామాలో వెల్లడి.

అయోధ్య తీర్పు ఎఫెక్ట్: ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే బోనస్..

UP's Ram Naam Bank with Lord Ram currency to give bonus over Ayodhya verdict, అయోధ్య తీర్పు ఎఫెక్ట్: ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే బోనస్..

ఉత్తర్​ప్రదేశ్​ అలహాబాద్​లో ‘రామ్​ నామ్ బ్యాంక్’ ఉంది. ఈ బ్యాంక్ రూటే సెపరేట్. ఎందుకంటే అక్కడ డిపాజిట్ చేసేది రామ నామం. ఈ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకున్న వాళ్లు..బుక్‌లెట్స్‌లో రామనామం, రామకోటి రాసి బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. తాజాగా అయోధ్య రాముడిదే అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సదరు బ్యాంకు తన ఖాతాదారులకు బోనస్ ప్రకటించింది.

ఇంతకీ బోనస్ ఏంటంటే:

నవంబర్ ​9-10 అర్ధరాత్రిలోపు కనీసం 1.25 లక్షల సార్లు రామనామాన్ని రాసి.. బ్యాంక్​లో డిపాజిట్​ చేసిన అకౌంట్ హోల్డర్స్‌కు ఓ  అవార్డ్ ఇవ్వనుంది ‘రామ్​ నామ్ బ్యాంక్’.  ఇప్పుడు ఒకసారి రామనామం రాస్తే..బ్యాంక్ ప్రకటించిన బోనస్ నేపథ్యంలో అది రెండుసార్లుగా పరిగణించబడుతుంది. వారు స్వదస్తూరితో రాసినా, కంప్యూటర్ లేదా మెబైల్ యాప్‌లో టైప్​ చేసిన కూడా అది కౌంట్ చేయబడుతోంది.  బ్యాంక్​ ఇచ్చే బుక్​లెట్​లోనే వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిర్ణీత గడువులోపు ఎవరైతే టార్గెట్ కంప్లీట్ చేసి ఉంటారో వారికి..సర్టిఫికెట్  బహుకరించనుంది బ్యాంక్.

దీనిలో భాగంగా ఒక కోటి కంటే ఎక్కువసార్లు రామనామం ఎవరైతే రాసినట్టు తేలుతుందో వారికి అక్షవతి మార్గ్‌లోని సెక్టర్-1 లో ఉచిత వసతి కల్పించనున్నారు. ఇప్పటివరకు కోటి మార్కును.. 12 మంది దాటినట్టు బ్యాంకు నిర్వాహకులు గుర్తించారు. వీరందర్నీ  2020లో అలహాబాద్​ సంఘం ప్రాంతంలో జరిగే మెగామేళాలో సత్కరిస్తారు.

 

Related Tags