Landslides In Indonesia: ఇండోనేషియాలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి

ఇండోనేసియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షానికి దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన జావా ద్వీపంలో కొండచరియలు రెండు సార్లు వెంట వెంటనే విరిగిపడి పడ్డాయి.. ఈ ప్రమాదంలో..

Landslides In Indonesia: ఇండోనేషియాలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి
Follow us

|

Updated on: Jan 10, 2021 | 5:55 PM

Landslides In Indonesia: ఇండోనేసియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షానికి దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన జావా ద్వీపంలో కొండచరియలు రెండు సార్లు వెంట వెంటనే విరిగిపడి పడ్డాయి. ఈ ప్రమాదంలో 12మంది మృతిచెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇండోనేషియా ఆర్మీ కెప్టెన్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నాయి. రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. సిహాన్‌జువాంగ్‌లోని ఒక వంతెన కూడా దెబ్బతిందని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు కొండ ప్రాంతాలు, నదీ తీరప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. జాతీయ విపత్తు నిరారణ అధికారి రాదిత్య జటి చెప్పారు.

Also Read: వారితో పాటు తొలి ప్రాధాన్యతలో ప్రజాప్రతినిధులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి.. ప్రధానికి ఎంపీ లేఖ