Astrology: ఈ రాశుల అమ్మాయిలు అందరి దృష్టిలో పడేందుకు తెగ ట్రై చేస్తారు.. డ్రామా క్వీన్స్ వీళ్లే..

|

Feb 22, 2022 | 9:33 PM

కొందరి ప్రవర్తన ఇతరులకు విసుగు పుట్టిస్తుంది. వారి శ్రుతిమించిన ప్రవర్తన.. మాటలతో ఇతరులు తెగ ఇబ్బందిపడుతుంటారు. ఎప్పుడు అందరి దృష్టిలో పడేందుకు..

Astrology: ఈ రాశుల అమ్మాయిలు అందరి దృష్టిలో పడేందుకు తెగ ట్రై చేస్తారు.. డ్రామా క్వీన్స్ వీళ్లే..
Zodiac Signs
Follow us on

కొందరి ప్రవర్తన ఇతరులకు విసుగు పుట్టిస్తుంది. వారి శ్రుతిమించిన ప్రవర్తన.. మాటలతో ఇతరులు తెగ ఇబ్బందిపడుతుంటారు. ఎప్పుడు అందరి దృష్టిలో పడేందుకు.. గ్రూపులో ఆకర్షణగా నిలిచేందుకు కొందరు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తుంటారు . (Astrology) తమను అందరూ గుర్తుపట్టాలని.. తమ గురించి మాత్రమే ఆలోచించాలని అనుకుంటారు. ఇతరుల పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోరు. జోత్యిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులు కల్గిన అమ్మాయిలు ఎప్పుడు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు. అయితే వారినే డ్రామా క్వీన్స్ అంటారు. మరీ ఏఏ రాశులవారు డ్రామా క్వీన్స్‏గా ఉంటారో తెలుసుకుందామా.

ధనుస్సు రాశి..
ఈ రాశి అమ్మాయిలు తమ అభిప్రాయాలను చెప్పడంలో ముక్కుసూటిగా ఉంటారు. కానీ.. వారు చెబుతున్న మాటలకు కాస్తా నాటకీయతను కూడా జత చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చెప్పేందుకు ఇష్టపడుతుంటారు. కానీ వీరికి తెలుసు.. వీరు చెప్పే విషయాలు ఇతరులకు నచ్చవు అని.. కానీ అవెం పట్టనట్లుగా తమ పని తాము చేసుకుంటూ పోతారు. కొన్ని సందర్భాల్లో వీరు చెప్పే మాటల వలన గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి..
వీరు సమస్యలను ఎదుర్కోవడానికి ఎప్పుడు ముందుంటారు. కానీ ఆ సమస్యలు… పోరాటాల గురించి నాటకీయతను జత చేసి చెప్తారు. వీరు బాధలో ఉన్నప్పుడు.. అలాగే.. సంతోషంగా ఉన్నప్పుడు.. అసంఘటిత పరిస్థితులను ఎదుర్కోన్నప్పుడు ప్రతి చిన్న పనిని అస్పష్టంగా.. అజాగ్రత్తగా చేస్తారు. అలాగే ఎదురయ్యే పరిస్థితులను అతిశయోక్తి చెస్తారు.

కర్కాటక రాశి..
వీరు తమ విషయాలను ఎదుటివారికి చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్, బాధగా..మూడీగా ఉంటారు. ఒక క్షణం భాగానే ఉంటారు.. అంతలోనే అల్లరిగా మారిపోతారు. ఎదుటివారు వీరి భావోద్వేగాలకు సరిగ్గా స్పందించనప్పుడు పెద్ద గొడవ చేస్తారు. అలాగే వీరు వద్దు.. లేదు అనే మాటలకు తీసుకోవడానికి ఇష్టపడరు. ప్రతి విషయంలో నాటకీయంగా ఉంటారు.

కుంభ రాశి..
సాధారణంగా ఈ రాశి వారు ఒకే పరిధిలో ఉండేందుకు ఇష్టపడతారు.. అంటే ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే.. వీరు తమ కోపంగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని నాటకీయ పరిస్థితిని సృష్టిస్తారు. వీరు చేసే పనులు చాలా అనుహ్యంగా ఉంటాయి. వీరితో మాములుగా ఉండడం చాలా కష్టం. ఎలాంటి కారణం లేకుండానే.. ఇతరుల ముందు నాటకీయంగా ప్రవర్తిస్తారు.

సింహరాశి..
ఈరాశి అమ్మాయిలు నాటక రంగానికే మహా రాణులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఇతరులలో తమ గుర్తింపు కోసం ఆరాటపడుతుంటారు. తామే గొప్పవారిమని.. ఎప్పుడూ తామే ప్రత్యేకమైనవారిమని నమ్మకంతో ఉంటారు. దీంతో వీరు చాలా అహంకారంతో అతిగా పనులు చేస్తుంటారు. ప్రతి విషయాన్ని అతిగా చెప్తారు. అయితే వీరికి దయ ఎక్కువగానే ఉంటారు.

Also Read: Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. మాజీలతోపాటు కొత్తగా వెళ్లేవారు వీళ్లే..

Adipurush: ఆదిపురుష్ స్టోరీ ఇదే అంటూ డైరెక్టర్ క్లారిటీ.. ప్రభాస్ రాముడు కాదంటూ..

Naresh: సినీ నటుడు నరేశ్ పేరుతో మహిళ భారీ మోసం.. లక్షల్లో వసూళ్లు.. ఆమెతో సంబంధం లేదంటూ..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ సినిమాలో..