Year-End Astrology 2026: మరో 50 రోజులు.. ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!
Year-End Astrology: 2026 ఏడాది ముగిసేలోగా కొన్ని రాశుల వారు వివాదాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గ్రహస్థితులు అనుకూలంగా లేని వారు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఆ ఆరు రాశులేవి? సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి పరిహారం పాటించాలి?

Year-End Astrology 2026
వచ్చే యాభై రోజుల కాలంలో, అంటే ఏడాది ముగిసే లోగా కొన్ని రాశుల వారు వివాదాలు, తగాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. వీరికి గ్రహచారపరంగా షష్ట స్థానం అనుకూలంగా లేనందువల్ల పనులు, వ్యవహారాలు, లావాదేవీల్లో ఆచితూచి అడుగువేయడం చాలా మంచిది. షష్ట స్థానం, షష్ట స్థానాధిపతి సమస్యలు, వివాదాలు, విభేదాలు, తగాదాలను సూచిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాలు, అపార్థాలు, అభిప్రాయ భేదాలు వంటివి కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు తరచూ కాలభైరవాష్టకం పఠించడం వల్ల జీవితం సాఫీగా, హాపీగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మీన రాశులకు ఇది వర్తిస్తుంది.
- మేషం: ఈ రాశివారికి షష్ట స్థానాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల డిసెంబర్ 2 వరకు జీవిత భాగస్వామితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతి చిన్న విషయానికి వాగ్వాదాలు తలెత్తే అవకాశం ఉంది. బంధువుల కారణంగా విభేదాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. భాగస్వాములతో మాట పట్టింపుల వల్ల వృత్తి, వ్యాపారాలు మందగించే అవకాశముంది.
- మిథునం: ఈ రాశికి షష్టాధిపతి అయిన కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నందువల్ల సోదరులతో ఆస్తి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 వరకు ఈ రాశివారు దగ్గర బంధువు లతో, తోబుట్టువులతో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న విషయాన్ని భూత ద్దంలో చూసే బంధువులతో ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో కూడా అపార్థాలు చోటు చేసుకుంటాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి.
- సింహం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శనైశ్చరుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ ఏడా దంతా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఒకపట్టాన కలిసి రావు. శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోవడం, మోసపో వడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా వివాదాస్పద వ్యవహారాలు బాగా ఎక్కువగా చోటు చేసుకుంటాయి.
- కన్య: ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాశిని సప్తమ స్థానం నుంచి వీక్షిస్తున్నందు వల్ల ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు బాగా పెరిగే సూచనలున్నాయి. డబ్బు ఇచ్చినా, తీసు కున్నా సమస్యలు, వివాదాలు తలెత్తుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి, వేధింపులు పెరిగి మానసికంగా ఒత్తిడికి గురవుతారు. సహా యం పొందినవారు అవసర సమయాల్లో ముఖం చాటేస్తారు. వ్యక్తిగత సమస్యలు పెరుగుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులు అతిగా ఉపయోగిం చుకోవడం వల్ల పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందకపోవచ్చు. కొందరు దగ్గర బంధువులు విమర్శలు, ఆరోపణలు సాగించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు. అపార్థాల వల్ల కొందరు మిత్రులు దూరం అవుతారు.
- మీనం: ఈ రాశికి షష్టాధిపతి అయిన రవి అష్టమంలో నీచబడి ఉన్నందువల్ల ప్రభుత్వంతో, అధికారులతో, రాజకీయ నాయకులతో తగాదాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగువేయడం మంచిది. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. రాశ్యధిపతి గురువు కూడా అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఏ పనీ సవ్యంగా పూర్తయ్యే అవకాశం ఉండదు.
ఇవి కూడా చదవండి
Follow Us



