Astrology: గ్రహాల అనుకూలత.. ఇక మీ జీవితంలో వెలుగులు ఖాయం భయ్యా..!
Telugu Astrology: జ్యోతిష శాస్త్రంలో లగ్నాధిపతి, రాశ్యధిపతులకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ గ్రహాల బలాన్ని బట్టి జాతకంలో యోగాలు, దోషాల ప్రభావం మారుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రహ సంచారంలో కొన్ని రాశులకు విశేషమైన అనుకూలత ఏర్పడుతోంది. ఇంతకీ ఆ రాశులేవి? ఎలాంటి ఫలితాలు కలగనున్నాయి?

Telugu Astrology
జాతక చక్రంలో లగ్నాధిపతి లేదా రాశ్యధిపతికి జ్యోతిష శాస్త్రం ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. లగ్నాధిపతి లేదా రాశ్యధిపతి బలంగా, సరైన స్థానంలో ఉండడం చాలా అవసరం. ఈ అధిపతి బలహీనంగా ఉన్న పక్షంలో జాతకంలో ఎన్ని యోగాలున్నప్పటికీ ఫలించే అవకాశం ఉండదు. ఈ అధిపతి బలంగా, సరైన స్థానంలో ఉన్న పక్షంలో ఎన్ని దోషాలున్నా కొట్టుకుపోతాయి. చిన్న యోగమైనా అద్భుత ఫలితాలనిస్తుంది. అందువల్ల లగ్నాధిపతి, రాశ్యధిపతి అన్నిటికన్నా ముఖ్యం. ప్రస్తుతం గ్రహ సంచారంలో మేషం, వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు బాగా అనుకూలంగా, బలం ఉండడం జరుగుతోంది.
- మేషం: రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానమైన సింహ రాశిలో ఈ నెల (నవంబర్) 12 నుంచి ఈ ఏడాదంతా సంచారం చేయబోతున్నందు వల్ల ఈ రాశివారికి యోగదాయకంగా ఉండబోతోంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇల్లు ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. ఉద్యోగంలో పదోన్న తులు కలగడమే కాక, డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ప్రస్తుతం కన్య, తులా రాశుల్లో సంచారం చేస్తున్నందువల్ల విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా నమోదవుతాయి. ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షల్లో నెగ్గడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లివిరుస్తాయి. గృహ, వాహన సంబంధమైన కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.
- మిథునం: రాశ్యధిపతి బుధుడు తనకు మిత్ర క్షేత్రమైన పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ ఏడాదంతా ఈ రాశివారి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచ నాలను మించి లాభించడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
- కన్య రాశి: రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో డిసెంబర్ 2 వరకు సంచారం చేస్తున్నందువల్ల ఆర్థికంగా కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. తప్పకుండా ఆదాయ వృద్ధి, వృత్తి, ఉద్యోగాల్లో పురో గతి లేదా ప్రమోషన్ వంటివి చోటు చేసుకోవడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సొంతగా వ్యాపా రాలు ప్రారంభిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది.
- వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు తనకు దశమ స్థానం, మిత్రక్షేత్రమైన సింహ రాశిలో సంచరిస్తున్నందువల్ల, ఈ రాశివారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఒక వెలుగు వెలుగుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. సంపన్నుల స్థాయికి ఎదుగుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ యోగం, ఆస్తి యోగం పడతాయి.
- ధనుస్సు: రాశినాథుడు గురువు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల జనవరి 25 వరకు ఈ రాశివారు విజయాలు, సాఫల్యాలతో పురోగతి చెందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందు తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరు తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభి స్తుంది.
- మకరం: రాశ్యధిపతి శనీశ్వరుడు ఈ ఏడాదంతా తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. సామాజికంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగా మెరుగవుతుంది.
ఇవి కూడా చదవండి
Follow Us



