AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit 2026: ప్రతికూల స్థానంలో రవి..కెరీర్‌లో ఈ రాశుల వారు జాగ్రత్త!

నవంబర్ 16న రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలతో పాటు అధికారులతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి దుస్థానంలో సంచరించే రవి కారణంగా ఏయే రాశుల వారికి ఇబ్బందులు కలిగించనుంది? ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిషశాస్త్రం సూచిస్తున్న పరిహారాలేమిటి?

Sun Transit 2026: ప్రతికూల స్థానంలో రవి..కెరీర్‌లో ఈ రాశుల వారు జాగ్రత్త!
Sun Transit 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 5:48 PM

Share

ఏ గ్రహమైనా దుస్థానాల్లో ఉండవచ్చు కానీ, గ్రహ రాజైన రవి మాత్రం దుస్థానాల్లో ఉండకూడదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల(నవంబర్) 16న వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్న రవి ఏ రాశికైనా 3, 6, 7, 8, 12 స్థానాల్లో సంచారం చేసే పక్షంలో రవి బలం క్షీణించి అధికారులతో, తండ్రితో, రాజకీయ నాయ కులతో, పాలకులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ తగ్గడం వంటి అవయోగాలు చోటు చేసుకుంటాయి. జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ రవి బలం క్షీణ స్థితిలో ఉన్నప్పుడు ఆదిత్య హృదయాన్ని పఠించడం గానీ, కెంపును ఉంగరంలో పొదిగి వేలికి ధరించడం గానీ చేయవలసి ఉంటుంది.

మేషం

ఈ రాశికి పంచమాధిపతి అయిన రవి ఈ నెల 16 నుంచి అష్టమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలతో ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లలకు సంబంధించిన పురోగతిలో ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పోటీ పెరుగు తుంది. అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందగిస్తాయి. వైఫల్యాలు ఎక్కువగా ఎదురవుతాయి.

వృషభం

ఈ రాశికి సప్తమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఉద్యోగంలో అధికారులు, కుటుంబంలో జీవిత భాగ స్వామి, వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పదోన్నతులు నిలిచిపోవడం, జీతభత్యాలు పెరగకపోవడం వంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామి అనారోగ్యా నికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా నష్టపోతారు. గృహ, వాహన ప్రయత్నాలు ఒకపట్టాన ముందుకు వెళ్లవు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మిథునం

ఈ రాశికి తృతీయాధిపతి అయిన రవి షష్ట స్థానంలో సంచారం చేయడంవల్ల తోబుట్టువులతోనే కాక తండ్రితో కూడా శత్రుత్వాలు ఏర్పడతాయి. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాగే అవకాశం ఉండదు. ప్రయాణాల్లో విలువైన పత్రాలు, వస్తువులను పోగొట్టుకో వడం జరుగుతుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. తరచూ అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తగ్గుతుంది.

కన్య

ఈ రాశికి తృతీయ స్థానంలో వ్యయ స్థానాధిపతి రవి సంచారం వల్ల ఒక పట్టాన ఏ ప్రయత్నమూ కలిసి రాకపోవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులు, సోదరుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు నష్టదాయకంగా మారతాయి. మిత్రులు శత్రువులవుతారు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి సమస్యలు, వివా దాలు తలెత్తుతాయి. ఆదాయం పెరిగినా అందులో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు

ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన రవి వ్యయ స్థానంలో ప్రవేశించడం వల్ల రాజపూ జ్యాల కంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర పరిచయాలు కలుగుతాయి. కష్టార్జి తంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులతో తిప్పట, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. నమ్మినవారి వల్ల మోసపోవడం జరుగుతుంది.

Follow Us