
స్వస్థానమైన తులా రాశిలో జనవరి 2 వరకు సంచారం చేయబోతున్న శుక్ర గ్రహం వల్ల కొన్ని రాశులకు చెందిన మహిళామణులకు రాజయోగాలు పట్టబోతున్నాయి. శుక్రుడు స్త్రీ గ్రహం అయినందువల్ల మహిళలకు అత్యధికంగా మేలు చేయడం జరుగుతుంది. ఉద్యోగినులకు పదోన్నతులు లభించడం, ఉద్యోగార్థులకు ఆశించిన ఉద్యోగం లభించడం, వృత్తి జీవితంలో ఉన్న మహిళలకు డిమాండ్ పెరగడం, పెళ్లి కావడం, సంతాన ప్రాప్తి కలగడం వంటివి చోటు చేసుకోవడం జరుగుతుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనూ రాశులకు చెందిన మహిళలకు విపరీత రాజయోగం, మహా భాగ్య యోగం వంటివి పట్టే అవకాశం ఉంది.
ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బాగా అనుకూలమైన వ్యక్తితో ప్రేమలో పడే సూచ నలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవంతో పాటు హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదే వీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ఈ రాశికి పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగినులకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజ యాలు సాధిస్తారు ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. కుటుంబ, దాంపత్య జీవితాలు అనుకూలంగా సాగుతాయి.
ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల మహిళామణులకు మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా ఫలిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషా లతో సాగిపోతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచే కాక, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలావరకు బయటపడతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. మంచి ఉద్యోగంలో చేరే సూచనలున్నాయి. కోరుకున్న వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశంఉంది.
రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు రాజ యోగాలు పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పదోన్నతులు లభిస్తాయి. నిరు ద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగ యోగం పడుతుంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి నిశ్చ యమవుతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల మహిళలకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. అనా రోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది.