Today Horoscope: ఈ రోజు వృషభం, మిథునం వారికి శుభవార్తలు.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే?

నవంబర్ 5, 2026 గురువారం దిన ఫలాలు: మేష రాశి ఉద్యోగులకు గుర్తింపు, వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆదాయ వృద్ధి సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్య ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Today Horoscope: ఈ రోజు వృషభం, మిథునం వారికి శుభవార్తలు.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే?
Horoscope

Edited By:

Updated on: Nov 05, 2026 | 6:39 AM

Today Horoscope (నవంబర్ 5, 2026): మేషం రాశివారి ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆశిం‍చిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృషభం రాశి వారి వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించి రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. మిథునం రాశి వారి ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మేషం నుంచి మీనం రాశి వరకు గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):

ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆశిం‍చిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా లాభసాటిగా సాగిపోతాయి. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృత్తి, వ్యాపారాల్లో అంచనాల్ని మించి రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఇంటాబయటా బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవ హారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధు వుల నుంచి పెళ్లికి సంబంధించిన శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగతి చెందుతాయి. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు కానీ, వృథా ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పుల్ని చేపట్టి లాభాలు అందుకుంటారు. గతంలో చేపట్టిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పది మందికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. అదనపు మార్గాల ద్వారా ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు బాగా తగ్గు ముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):

వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన లక్ష్యాలు, బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు బాగా ఉత్సాహంగా పురోగమిస్తాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖుల నుంచి అనుకోకుండా గుర్తింపు, సత్కారాలు లభిస్తాయి. తోబుట్టువులతో లేదా బంధు వులతో వివాదాలు సద్దుమణుగుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి లబ్ధి పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి కారణంగా కొన్ని పనులు వాయిదా పడతాయి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆదాయానికి లోటుండదు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడంమంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి తగిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద వీలైనంత శ్రద్ధ పెట్టడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కా రమవుతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహరాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధు వుల రాకపోకలుంటాయి. ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us