Solar Eclipse 2022: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Surya Grahan 2022) నేడు ఏర్పడనుంది. పైగా ఈ రోజు శనివారం అమావాస్య. సూర్యగ్రహణ ప్రభావం మనపై ఎంత? అంటే భారతదేశంలో నివసించే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఖగోళ నిపుణులు. ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని వారు అంటున్నారు. నిన్న, ఏప్రిల్ 29వ తేదీ తెల్లవారు జాము 3 గంటలకు శని దేవుడు కుంభరాశిలోకి ప్రవేశించారు. ఈ రాశిలో 74 రోజులుండి జూలై 12న వక్రించి తిరిగి మకరరాశిలోకి వస్తాడు. ఈ వక్రగమనం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నదొక జ్యోతిష్య శాస్త్ర చర్చ. మరి దీని ప్రభావం పన్నెండు రాశులపై ఎలా ఉందో తెలుసుకుందాం రండి.
మేషం
ఈరాశివారికి శని కుంభరాశి ప్రవేశంతో అద్భుత ఫలితాలు ఉన్నాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు. ఆర్థికలాభం. సంతాన సాఫల్యత. నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు. స్త్రీ మూలక ధనలాభం. అతి ఆలోచనలు పనికిరావు. సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు జ్యోతిష నిపుణులు
వృషభం
ఈ రాశివారికి గతంలోకంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. వృత్తి జీవితంలో మార్పులు. కలలు సాకారమయ్యే రోజులు. ఆర్థిక పురోభివృద్ధి. వ్యాపారాల్లో లాభాలు. ఆరోగ్యపరంగా ఇబ్బందికర వాతావరణం. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పండితులు.
మిథునం
ఈ రాశివారికి ప్రశాంతత ఉంటుంది. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకెళ్లే పరిస్థితి. పోటీ తప్పదు. జాగ్రత్త అవసరం. నెగిటివ్ ఫ్రెండ్షిప్ కి వీలైనంత దూరంగా ఉండాలి. అప్పులు ఇవ్వడం తీసుకోవడం మంచిది కాది.
కర్కాటకం
ఈ రాశివారికి మానసిక ఒత్తిడి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి పట్ల కేరింగ్ అవసరం. అప్పులకు దూరం పాటించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్లక్ష్యం తగదు. అనవసర గొడవల్లో తలదూర్చరాదు. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం పట్ల శ్రద్ధ అవసరం.
సింహం
ఈ రాశివారికి శని కుంభ సంచారం వల్ల మేలు కలుగుతుంది. ఊహించని మార్పులు. ఆర్థికాభివృద్ధి. జీవిత భాగస్వామి పట్ల జాగ్రత్తలు అవసరం. వారి మనసెరిగి ప్రవర్తించాలి. వ్యతిరేక ఆలోచనలు మంచిది కాది.
కన్య
గతంలో కన్నా మెరుగైన ఫలితాలు. అప్పు బాధలు తీరొచ్చు. అనూహ్య విజయాలు దక్కవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి శుభ సమయం. ప్రయత్నిస్తే అద్భుత ఫలితాలు. ఖర్చులను అదుపు చేయాలి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
తుల
ఈ రాశివారికి అనుకోని అదృష్టం. వ్యాపారస్తులకు అనుకూలం. నిరుద్యోగులకు శుభవార్త. విద్యార్థులకు మంచి ర్యాంకులు. విదేశీ విద్యకు అనుకూలం. బంధుమిత్రులతో అనవసర విబేధాలు. వాదోప వాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమనీ అంటున్నారు.
వృశ్చికం
ఈ రాశివారికి ఊరటనిచ్చే సమయం. సున్నితంగా మాట్లాడాలి. చెప్పింది ఓపిగ్గా వినాలి. కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. భావోద్వేగాలు నియంత్రించుకోవాలి . దీర్ఘకాలిక రోగాలున్నవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు
ఈ వారికి శని సంచారం పండగే పండగ. ఈరాశివారికి ఏలిన్నాటి శని ద్వారా విరామం లభిస్తుంది. ఆర్థికంగా ఎన్నో మంచి అవకాశాలు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం. విదేశీ విద్య ఉద్యోగాలకు అనుకూల సమయం. వివాహ సంతాన ప్రాప్తి. పరిశోధకులకు మంచి ఫలితాలు అందుతాయి.
మకరం
ఈ వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల పట్ల శ్రద్ధ అవసరం. మృదువుగా మాట్లాడాలి. ఉద్యోగస్తులకు ఆదాయంతో పాటు పని ఒత్తిడి. శని ధ్యానం చేయడం ఉత్తమం. సహోద్యోగులతో కలసి మెలసి ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మాట తీరుఓర్పుతో ఉండటం వల్ల యోగదాయకంగా ఉంటుంది.
కుంభం
ఈ రాశివారికి వివాహ బంధం మెరుగు పడుతుంది. పనుల్లో పురోభివృద్ధి. పనుల పట్ల స్పష్టత. పర్యావరణంపై ఆసక్తి. మానసిక ధైర్యంతో ముందడుగు. చంచల బుద్ధి, ఊగిసలాడే ధోరణి. అప్పులు ఇవ్వడం తీసుకోవడం తగదు. ఉద్యోగులకు పనుల్లో వేగం పెరుగుతుందంటున్నారు నిపుణులు.
మీనం
ఈవారికి విదేశీ ఉద్యోగాలు. నిర్లక్ష్యం వల్ల అవకాశాలు దూరం. బద్దకం వీడాలి. ఇతరుల విషయాల పట్ల జోక్యం తగదు. అనవసర వ్యయం తగ్గించాలి. ఇతరులతో దురుసుగా ప్రవర్తించరాదు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి.
మొత్తంగా శని గ్రహ మార్పు ప్రభావం వల్ల.. ఈ అమావాశ్య నుంచీ.. పన్నెండు రాశుల వారికి కొందరికి అదృష్టం.. మరి కొందరికి అరిష్టం. గురు, శుక్ర గ్రహాలు బాగున్న వారికి శని ప్రభావం వల్ల ఉపశమనం లభిస్తుంది. శని భగవానుడి అనుగ్రహం మరింత పెరగాలని కోరుకునే వారు. అన్నదానం చేయడం ఉత్తమం. కాలభైరవ ఆరాధన మేలు చేస్తుందనీ చెప్పుకొస్తున్నారు. శనివారం నాడు శివాలయంలో నేతితో దీపం పెట్టాలని సూచిస్తున్నారు పండితులు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)
Also Read: